తమిళ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పనిలేదు.
ఒకప్పుడు లిటిల్ స్టార్ గా కోలీవుడ్ , మాలీవుడ్, టాలీవుడ్ ను షేక్ చేసి పారేసాడు. ఆ తర్వాత ఒక్కసారి గా డౌన్ ఫాల్ చూసాడు. ఇప్పుడు ఎంతో సీరియస్ గా కెరీర్ ను మళ్లీ పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. కాని అందుకు తగ్గ చిత్రం పడటం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన థగ్ లైఫ్ కూడా డిజాస్టర్ అయింది. అంతకు ముందు నటించిన రెండు చిత్రాలు కూడా ఆశింనంత మేర మెప్పించలేదనే చెప్పాలి. కాని 2021లో శింబు నటించిన మానాడు బ్లాక్ బస్టర్ అయింది.

టైమ్ లూప్ కాన్సెప్ట్ ను దర్శకుడు వెంకట్ ప్రభు డీల్ చేసిన విధానం సినిమాను కోట్లు కోట్లు కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.ఇక  ఎస్ . జే.సూర్య చెప్పిన రిపీట్ డైలాగ్ కూడా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాడు శింబు. అందుకు సంబంధించి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయట. ప్రస్తుతం వెంకట్ ప్రభు పార్టీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ రిలీజైన వెంటనే శింబు హీరోగా మానాడు సీక్వెల్ తెరకెక్కనుందట. ఈ మూవీ తో అయినా శింబు కోలీవుడ్ కు గట్టి కమ్ బ్యాక్ ఇస్తే తమిళ ఇండస్ట్రీకి , ఆయన ఫ్యాన్స్ కు పండగే.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
error: Content is protected !!