టాలీవుడ్ యంగ్ హీరోల్లో, నాని సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస విజయాలతో, స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టేందుకు పరుగులు తీస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడితో, నాని సినిమా చేస్తే, అది నేచురల్ కెరీర్ కు పెద్ద చిత్రం అవుతుంది. పైగా టాలీవుడ్ ఎప్పటి నుంచో వీరి కాంబినేషన్ గురించి ఎదురు చూస్తోంది. గతంలో చాలా సార్లు నానిని,ఇదే కాంబినేషన్ గురించి ప్రశ్నించగా, టైమ్ రావాలిగా అనేవాడు. ఇప్పుడు కుబేర ప్రమోషన్స్ లో, శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చాడు. నానితో మూవీ వర్క్ జరుగుతోందంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికిప్పుడు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు.

నాని కోసం శేఖర్ కమ్ముల ఏదో పెద్దగానే ట్రై చేస్తున్నాడు. అందుకే టైమ్ అడుగుతున్నాడు. ప్రస్తుతం నాని కూడా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. హిట్ -3 తర్వాత ప్యారడైజ్ విడుదల కానుంది. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత సుజిత్ తో నాని మూవీ చేయనున్నాడు.ఆ తర్వాతే శేఖర్ తో నాని న్యూ మూవీ ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!