తెలుగులో స్టార్ హీరోలు, తమ కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ లో నటిస్తున్నారు. కల్కి తర్వాత ప్రభాస్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిల్లో కొన్నిటికి టైటిల్ ఫిక్స్ అయ్యాయి. మరికొన్నిటికి టైటిల్ ఫిక్స్ కావాల్సి ఉంది. వాటిల్లో సీతా రామం ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా ఉంది. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ ప్రచారం లో ఉంది. కాని ఫిక్స్ కాలేదు.

అలాగే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రంలో రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి బకా అనే పేరు పరిశీలనలో ఉందట. మహాభారతం లోని బకాసురుడు పాత్రను స్ఫూర్తిగా తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ వర్మ.

ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న న్యూ మూవీకి పెద్ది అనే టైటిల్ అనుకుంటున్నారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అలాగే  ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీకి డ్రాగన్ అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తోన్న చిత్రానికి రాక్ అనే టైటిల్ అనుకుంటున్నారట.

ఇక మహేష్ బాబు – రాజమౌళి చిత్రానికైతే బోల్డన్ని టైటిల్స్ రూమర్స్ గా షికారు చేస్తున్నాయి. మహారాజా అని గోల్డ్ అని, అబ్బో చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది.

ఇక అనిల్ రావిపూడి మేకింగ్ లో చిరు నటించబోయే మూవీకి సంక్రాంతి అల్లుడు టైటిల్ ఫిక్స్ చేయాలని రాఘవేంద్ర రావు ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి ఉన్నారు.

error: Content is protected !!