యంగ్ హీరో నితిన్ , తన కెరీర్ ప్రారంభించిన చాలా ఏళ్లు దాటింది. కాని స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టలేకపోయాడు. 2002 నుంచి 2025 వరకు కెరీర్ చూసుకుంటే, హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ. పైగా  ఈ మధ్య పరిస్థితి మరీ దారుణం, మ్యాస్ట్రో అంటాడు, మాచర్ల నియోజక వర్గం అంటాడు, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటాడు, రీసెంట్ రాబిన్ హుడ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అన్ని కూడా డిజాస్టర్స్. ఈ దశలో దిల్ రాజు బ్యానర్ లో , వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తోన్న తమ్ముడు చిత్రం, నితిన్ కెరీర్ కు కీలకంగా మారింది. అయితే ఇది రెగ్యూలర్ కమర్షియల్ చిత్రం కాదు.ఒక రాత్రి జరిగే స్టోరీ. కాస్త డిఫరెంట్ గా ఉంది. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా కనిపించింది.

అయితే తమ్ముడు సినిమా కోసం నితిన్ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత సినిమా కోసం కూడా నితిన్ తనకు కావాల్సిన విధంగా రెమ్యూనరేషన్ అందుకోలేకపోయాడు. అందుకు కారణం, నితిన్ వరుస ఫ్లాపులు. వీటి వల్ల రేపు తమ్ముడు థియేటర్స్ కు వచ్చినా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అనుమానమే.. అందుకే తనవంతుగా రెమ్యానరేషన్ తగ్గించుకోని ఈ సినిమా చేసాడు నితిన్. అయితే ఇక పై నితిన్ మాత్రం, కెరీర్ ను ఏమాత్రం నిర్లక్ష్యాంగా తీసుకోవడానికి వీల్లేదు. చేస్తే మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, లేదా తన ఇమేజ్ ను మార్చే స్టోరీస్ చేయాలి. అప్పుడే మార్కెట్ నిలబడుతుంది. లేదా పెరుగుతుంది. లేకపోతే ఇలా రెమ్యూనరేషన్స్ లో డిస్కౌంట్ ఇస్తూ వెళ్లాల్సిందే.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!