
పుష్పలో అంటే రష్మిక హీరోయిన్. మొదటి భాగం తర్వాత వెంటనే రెండవ భాగం తెరకెక్కింది. అందుకే రష్మిక రిపీటైంది. ఇంకా మూడో భాగం కూడా ఉంది. కాని ఈలోపే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రంలో, రష్మిక కూడా నటిస్తోందట. ఈ చిత్రంలో దీపిక, మృణాల్, జాన్వీ కపూర్, ఇలా పాన్ ఇండియా వైడ్ లేడీ సూపర్ స్టార్స్ అందరూ నటిస్తున్నారు. ఇప్పుడు వీరితో పాటు రష్మిక కూడా ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తోంది అంటే, ఇది పక్కాగా ఐకాన్ సెంటిమెంట్ అనే చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు నెటిజెన్స్.
ఈ మధ్య కాలంలో రష్మిక ఏ చిత్రంలో నటిస్తే, ఆ సినిమా సూపర్ హిట్. ఏ ఇండస్ట్రీలో నటించినా, సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. పుష్ప, యానిమల్, ఛావా, కుబేర లాంటి చిత్రాలను రష్మికను, నేషన్ కు నెంబర్ వన్ ను హీరోయిన్ ను చేసాయి. ఈ సెంటిమెంట్ తోనే తన కొత్త చిత్రంలో, రష్మికకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడా బన్ని అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇక అట్లీ ఈ చిత్రాన్ని, భారీ బఢ్జెట్ తో తెరకెక్కిస్తున్న ట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది.
ముంబైలో అల్లు అర్జున్, దీపిక మధ్య కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. రాబోయే రెండు నెలలు ఇదే షెడ్యూల్ కంటిన్యూ కానున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ సూపర్ హీరోగా నటిస్తున్నాడని టాక్ ఉంది. హాలీవుడ్ నుంచి విల్ స్మిత్, రాక్ లాంటి స్టార్స్ విలన్ గా నటింపజేసేందుకు అట్లీ ట్రై చేస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
