త్రిబుల్‌ ఆర్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు రామ్ చరమ్. అతను కంప్లీట్ స్టార్ మెటీరియల్. పైగా అద్భుతమైన పర్ఫామర్కా ని ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి చిత్రాలు, రామ్ చరణ్ ను, అతని అభిమానులను తీవ్రంగా కలచి వేసాయి. కొన్ని సార్లు కొన్ని ప్రాజెక్టులు చేయకతప్పదు. అలాగే ఈ చిత్రాలను చేసాడు రామ్ చరణ్. కాని పెద్దితో ఆ బాధలను మొత్తం పోగోట్టేసేలా ఉన్నాడు చరణ్. నిజం చెప్పాలి అంటే అల్రెడీ పెద్ది ఇస్తోన్న హైకి, మెగా ఫ్యాన్స్ ఆచార్య, గేమ్ ఛేంజర్ ఫలితాలను మర్చిపోయారు.

మార్చిలో సినిమా రిలీజ్ ఉండటంతో, ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారు. ముందు పెద్ది టీజర్ రిలీజైంది. ఇది సూపర్ హిట్టైంది. ఇప్పుడు రిలీజైన చికిరి సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్టైంది. మార్చికు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. అయినా సరే ప్రమోషన్స్ లో పెద్ది చాలా ముందుంది. ఇదే స్పీడ్‌లో మరో సాంగ్ రిలీజై సూపర్ హిట్టైతే మాత్రం, ఇదే హై సినిమా రిలీజ్ వరకు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!