కన్నప్పతో విష్ణు కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ పెడతాను అంటున్నాడు.అందులో భాగంగా త్వరలోనే క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఎనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా. ఈసారి కమర్షియల్ మూవీ చేయబోతున్నట్లు ఖరారు చేసాడు.

ప్రభుదేవా అంటే  తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ గుర్తుకు వస్తుంది. హిందీలోనూ సల్మాన్ తో దబంగ్ 3, రాధే లాంటి మాస్ మూవీస్ తీసాడు. పక్కా కమర్షియల్ డైరెక్టర్. అందుకే విష్ణు ఈసారి ప్రభుదేవాకు సినిమాను ఇవ్వానుకుంటున్నాడట. పైగా కన్నప్ప సాంగ్స్ కు, మిగితా కొన్ని సీన్స్ కు తాను అందించిన సహకారం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అందుకు తగ్గట్లే మంచు ఫ్యామిలీతో,ప్రభుదేవాకు మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ రీజన్ తో కూడా ప్రభుదేవాకు తన కొత్త చిత్రాన్ని తెరెకక్కించే బాధ్యత ఇవ్వబోతున్నాడట మంచు విష్ణు.

ఇది కూడా చదవండి

error: Content is protected !!