ప్రభాస్ లాంటి కటౌట్ భయపడితే, ఎవరు చూస్తారు చెప్పండి. కథ దగ్గరే ఇలాంటి స్టోరీస్ మొత్తం పక్కనపెట్టేస్తారు. కాని దర్శకుడు మారుతి,ఈ పని చేయగలిగాడు. భల్లాలను గడగడలాడించిన వ్యక్తి, సలార్ హీరో, వన్ మ్యాన్ ఆర్మీ, ఒక దెయ్యానికి భయపడ్డాడు. అదీ రాజా సాబ్ టీజర్ లో హైలైట్. గత రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను, చిత్ర యూనిట్ కొద్ది గంటల క్రితం విడుదల చేసింది.

అందరూ ఈ టీజర్ లో రెబల్ స్టార్ వింటేజ్ లుక్ బాగుంది, లేదా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది, విజువల్స్ కుమ్మేసాయి అంటున్నారు కాని, ఎవరూ కూడా ప్రభాస్ భయపడుతున్న సన్నివేశాల గురించి పెద్ద గా ప్రస్తావించలేదు. రాజాసాబ్ టీజర్ మొత్తంలో కూడా ప్రభాస్ భయపడిన సన్నివేశమే హైలైట్. ఇంతకీ రెబల్ ను అంతగా భయపెట్టిన సంజయ్ దత్ ను ఎలా కంట్రోల్ చేసాడు అనేది తెలియాలంటే డిసెంబర్5 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అదే రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!