
స్టోరీకి పెట్టిన టైటిల్ చూసి, సింపుల్ గా మీరు ఒకటి గెస్ చేసి ఉంటారు. అదేంటి అంటే, సరిలేరు నీకెవ్వరు మూవీని రణభీర్ కపూర్ హిందీలోకి రీమేక్ చేస్తున్నాడని ఫిక్స్ అయి ఉండవచ్చు. కాని టైటిల్ స్టోరీ అది కాదు. మరి ఏంటి అంటారా.. మహేష్ బాబు, రణభీర్ కపూర్ మల్టీస్టారర్. అవునా ఇదెప్పుడు లాక్ అయింది. మళ్లీ మల్టీస్టారర్ అనగానే, ఇదేదో వార్ -2లో మూవీ లాగే హృతిక్, ఎన్టీఆర్ కలసి నటిస్తారు అనుకోకండి. ఒకరు హీరో, మరొకరు విలన్ కూడా నటిస్తారని ఊహించేసుకోకండి… మరి ఏమనుకోమంటారు అని ఫ్రస్ట్రేట్ కూడా అవ్వకండి. అసలు స్టోరీ ఏంటంటే,రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న కొత్త సినిమా ఉందిగా, అదే మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే లెక్కలేనన్ని రూమర్స్ వచ్చాయి.. వస్తన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ రూమర్ ఏంటంటే,
సెకండాఫ్ లో ఒక ఎపిసోడ్ లో రణభీర్ కపూర్ సర్ ప్రైజ్ చేస్తాడట. ప్రస్తుతం ఈ రూమర్ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. మహేష్ బాబు, రణభీర్ కపూర్ కు మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే యానిమల్ తెలుగు ప్రీ రిలీజ్ కు రణభీర్ కోసమే, మహేష్ ముఖ్య అతిథిగా విచ్చేసాడు. పైగా రాజమౌళితో కూడా రణభీర్ కపూర్ కు చాలా సాన్నిహిత్యం ఉంది. అందుకే ఇదే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేశాడు. రణభీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీని దగ్గరుండి పాన్ ఇండియాకు ప్రమోషన్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, మహేష్ మూవీలో రణభీర్ కొద్ది నిముషాలు కనిపించేందుకు ఒప్పుకున్నాడట. అదే నిజమైతే మాత్రం మ్యూచువల్ ఫ్యాన్స్ కు పండగే. టాలీవుడ్, బాలీవుడ్ లో ఈ సినిమాకు బంపర్ ఓపెనింగ్స్.. సారీ రికార్డ్ ఓపెనింగ్స్ ఖాయమే..
ఈ స్టోరీ కేవలం, ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ రూమర్ పైనే.. సినిమా పై మరిన్ని డీటైల్స్, రూమర్స్, గాసిప్స్ కోసం ఈ కింది లింక్స్ ను చూడండి.
ఇవి కూడా చదవండి
- రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు
- జై అఖండ ఉంటుందా..? ఉంటుందంటోన్న జై బాలయ్య!
- మార్చిలో రిలీజైన చిత్రానికి , ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి బన్ని?
- ఏం టైటిల్ ఇది త్రివిక్రమ్? మరీ ఇంత పిరికితనమా?
- వారం గ్యాప్లో బాబాయ్,అబ్బాయ్ బాక్సాఫీస్ దాడి?
