ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న సినిమాలు అన్ని వేరు. అలాగే తాను వర్క్ చేస్తోన్న దర్శకులు అందరూ వేరు. ఎందుకంటే వన్స్ సందీప్ వంగా సినిమా స్టార్ట్ అయితే, మరో మూవీ చేయడానికి వీల్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు సినిమా షూటింగ్ అంటే కుదరదు. మొత్తంగా రెబల్ ను బ్లాక్ చేసేసాడు సందీప్ వంగా. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ అంటూ ముందు నుంచి వింటూ వస్తున్నాం. సందీప్ వంగా కూడా సెప్టెంబర్ చివరి వారం నుంచి షూటింగ్ స్టార్ట్ అంటున్నాడు. అంతే కాదు నాన్ స్టాప్ షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేసాడట. ఈ విషయాన్ని కింగ్డమ్ టీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంటే సినిమా కంప్లీట్ అయ్యే వరకు రెబల్ ను వదలడు.

అదే జరిగితే రాజాసాబ్ కు ఇబ్బంది కాదు కాని, రెండంటే రెండు నెలల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ షూటింగ్  కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి హను చేస్తాడా లేక, బ్రేక్ ఇచ్చి సందీప్ వంగా సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం అంటాడా అనేది చూడాల్సి ఉంది. రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఫౌజీ ఎప్పుడూ అనేది తెలియదు. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయితే 2026 డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ ఉండే అవకాశం ఉంది. హీరోయిన్ గా యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమిరి నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!