పెద్ది కోసం రంగంలోకి పుష్ప డైరెక్టర్ అనగానే, సుకుమార్ కూడా ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాడా అని డౌట్ పడవచ్చు, ఈ సినిమా గురించి ఇంకాస్త లోతుగా తెల్సిన వారు, పెద్దికి సుకుమార్ కూడా కో ప్రొడ్యూసర్ కదా, దర్శకుడు బుచ్చిబాబుకు గురువు కదా అనుకోవచ్చు. కాని అది కాదు మ్యాటర్, పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. మార్చి 27 మూవీ రిలీజ్ టార్గెట్‌గా పెట్టుకున్నారు.

అందుకోసం జనవరి ఎండ్ కు షూట్ కంప్లీట్ చేయాలి అనేది టార్గెట్‌గా పెట్టుకుంది చిత్ర యూనిట్. చాలా వరకు టార్గెట్ అయిపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు టాకీ పూర్తైంది. కేవలం రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. మొత్తంగా ఫిబ్రవరితో గుమ్మడికాయ కొట్టేస్తారు. అయితే అంతే వేగంగా,

ఈ సినిమా ఎడిటింగ్ వర్క్ కూడా జరిగిపోతోంది. ఎందుకంటే ఎడిటింగ్ టేబుల్ పై పెద్దికి సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న సుకుమార్ కూర్చుంటున్నాడట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని, పెద్ది ఎడిటింగ్ మాత్రం జెట్ స్పీడ్‌లో జరిగిపోతోందని, త్వరలోనే మరో టెర్రిఫిక్ టీజర్‌ను కట్ చేయబోతున్నారని బాగా ప్రచారం సాగుతోంది. పెద్ది నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ 200 మిలియన్ వ్యూస్ దాటింది. త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది ప్రైడ్ తెలుగు ఎక్స్ క్లూజివ్ న్యూస్

ఇది కూడా చదవండి

error: Content is protected !!