
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఎప్పుడని, వరల్డ్ వైడ్ గా డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో, ట్రంప్ ఎవరూ ఊహించని విధంగా, తన రెగ్యూలర్ డైలాగ్ ను రిపీట్ చేసాడు. అదే రెండు వారాల గడువు. ఇరాన్ పై అమెరికా సైనిక చర్య చేపట్టే విషయంలో, ట్రంప్ రెండు వారాల్లో అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ చెప్పుకొచ్చింది.
అయితే ఈ రెండు వారాల గుడువు వెనుక, ఇరాన్ మరో లిబియా కాకూడదు అనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. గతంలో లిబియా లో ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. దీంతోనే 2011లో గడాఫీ ప్రభుత్వం అంతమైంది. కాని అప్పటి నుంచి లిబియా అంతర్యుద్ధంతో అతలాకుతలం అవుతోంది. ఇదే విధంగా ఇరాన్ కూడా మారితే, పరిస్థితి ఏంటి అనేది, ట్రంప్ ను వెనకడుగు వేసేలా చేస్తోందని అనేక అంతర్జాతీయ వార్త కథనాల్లో పేర్కొన్నాయి.
ఇరాన్ మరో లిబియాగా మారకూడదు అనేదే ట్రంప్ కోరుకుంటున్నాడు. అదే జరిగితే అది ఇరాన్ కు, అమెరికాకు దీర్ఘకాలం ఇబ్బందికరం అని ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒక వేళ ఇరాన్ పై దాడులు చేయాల్సి వచ్చినా, అణుకేంద్రాలపై గగనతల దాడులకు మాత్రమే అమెరికా పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి