విక్టరీ వెంకటేష్ తీసుకుంటున్న నిర్ణయాలు, టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చిరుతో కలసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. నెల రోజు షూటింగ్ డేస్ ఇచ్చాడు అంటే, సినిమాలో వెంకీ రోల్ చాలా సేపు ఉంటుందనే లెక్క. ఆ తర్వాత త్రివిక్రమ్ తో తన కెరీర్ లోనే బిగ్ మూవీ చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ ను ఆల్రెడీ నిర్మాత నాగ వంశీ ఇచ్చేసాడు. రేపో మాపో మంచి ముహూర్తం చూసి, సినిమాను ఎనౌన్స్ చేసారు.

ఒక వైపు చిరుతో మల్టీస్టారర్, మరో వైపు త్రివిక్రమ్ తో బిగ్ మూవీ, వీటి మధ్యలో దృశ్యం -3 ఎందుకని వెంకీ లైట్ తీసుకుంటున్నాడని, టాలీవుడ్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఎలాగూ మోహన్ లాల్ దృశ్యం-3ని ప్యాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నాడు. దీనికి మళ్లీ తాను ప్రత్యేకంగా దృశ్యం -3లో నటించడం ఎందుకని, వెంకీ ఈ ప్రాజెక్ట్ కు దూరంగా ఉంటున్నాడట.

ఇక దృశ్యం-3 స్థానంలో సురేష్ ప్రొడక్షన్స్ కు మరో మూవీ చేసేందుకు వెంకీ  డేట్స్ ఇచ్చాడు. ఇది విక్టరీ వారి ఓన్ బ్యానర్ అని తెల్సిందే. అయితే సురేష్ ప్రొడక్షన్స్ లో నటించే ముందు, అనిల్ రావిపూడితోనే వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్  చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రారంభించి 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. సో సురేష్ ప్రొడక్షన్స్ లో మూవీ ఆ తర్వాతే పట్టాలెక్కనుంది. ఈలోపు వెంకీ కోసం సురేష్ ప్రొడక్షన్స్ ఒక డైరెక్టర్ ను లాక్ చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి
error: Content is protected !!