కొద్ది గంటల్లో వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవుతోంది. పైగా ట్రైలర్ ను సాక్షాత్తు సినిమా హీరో పవన్ కల్యాణ్ చూడటం, ట్రైలర్ అదిరిపోయిందంటూ రివ్యూ ఇవ్వుడం, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కొత్తగా ఉంది. అందుకే హరి హర వీరమల్లు ట్రైలర్ కోసం ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కల్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. నెల రోజల క్రితం వరకు ఈ సినిమాకు అస్సలు క్రేజ్ లేదు. అలాంటి ప్రాజెక్ట్ కు, ఇప్పుడు కనీవినీ ఎరుగని క్రేజ్ వచ్చేసింది. కొద్ది గంటల్లో రిలీజ్ అయ్యే ట్రైలర్ సూపర్ హిట్ అయితే మాత్రం ప్యాన్ వైడ్ గా బిజినెస్ లెక్కలు మారిపోతాయి. ఇప్పటికే రిలీజ్ అవుతున్న ఈ సినిమా పోస్టర్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఏదో పెద్ద సంచలనానికి పవన్ రెడీ అవుతున్నాయని చెప్పకనే చెబుతున్నాయి.

ఇక త్రివిక్రమ్ కూడా రంగంలోకి దిగడంతో వీరమల్లు రేంజ్ ఏంటి అనేది ఇట్టే తెల్సిపోతుంది. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లోనూ పవర్ స్టార్ తిరుగులేని కింగ్. ఓపెనింగ్స్ విషయంలో, రికార్డ్స్ విషయంలో, వసూళ్లు విషయంలో, ఇలా ఏది చూసుకున్నా పవర్ స్టార్ కు తిరుగులేదు. కాకపోతే అందుకు తగ్గ ప్రాజెక్ట్ ఒక్కటే ఈ మధ్య కాలం లో రాలేదు. ఆలోటను కొంతైనా వీరమల్లు తీర్చితే మాత్రం పవర్ స్టార్ మేనియా అంటే ఏంటో మరోసారి తెలుగు రాష్ట్రాలు చూస్తాయి. అది ప్యాన్ ఇండియాకు విస్తరిస్తుంది. ఓజీ రిలీజ్ టైమ్ కు పీక్స్ కు చేరుకుంటుంది.

అందుకే వీరమల్లు ట్రైలర్ పై అంత క్యూరియాసిటీ, వీరమల్లు పై అంచనాలు లేవు. ట్రైలర్ తో అంచనాలు పెరిగి, జులై 24న థియేటర్స్ లోకి అడుగు పెట్టే ప్రేక్షకుడు ఏ మాత్రం ఇంప్రెస్ అయినా సరే, తెలుగు రాష్ట్రాల పవన్ నామస్మరణతో ఊగిపోయాయి. పవన్ ఫ్యాన్స్ మళ్లీ పవనిజం జెండా ఎత్తుకుంటారు. ఆంధీ దెబ్బకు బాక్సాఫీస్ విలవిల్లాడటం ఈ తరం ప్రేక్షకులు కూడా చూస్తారు. ఇవన్ని జరగాలి అంటే ముందు వీరమల్లు ట్రైలర్ హిట్ అవ్వాలి. ప్రైడ్ తెలుగు అయితే హిట్ కాదు బాక్సాఫీస్ సునామి తీసుకురావాలని కోరుకుంటోంది. తెలుగు రాష్ట్రాల థియేటర్స్ ఆకలిని పవర్ స్టార్ లాంటి తుపాన్ మాత్రమే తీర్చగలదు. ఆ రోజులు రావాలని కోరుకుందాం.

ఇది కూడా చదవండి

error: Content is protected !!