
ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే, మనం ఏమంటావ్, కమల్ హాసన్.. అంటూ ఆటపట్టిస్తాం. ఇందులో లోకనాయకుడుని తక్కువ చేసి చూడటం లేదు కాని, నటనలో ఆయన్నే మించిపోయారు అనే అర్ధం వచ్చే విధంగా, పిలుస్తుంటాం. ఈ సంగతి పక్కనపెడితే, పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నటనలో, కమల్ హాసన్ ను మంచిపోయాడు. పైకి శాంతి కోరుకోవడం, వెనుక చేసేది అంతా చేయడం, నవాజ్ షరీష్ అద్భుతంగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ లోని పంజాబ్ సమాచార మంత్రి అజ్మా బుఖారీ చెప్పుకొచ్చింది. పైకి కనిపించే నవాజ్ షరీఫ్ వేరు.. లోపల నవాజ్ షరీఫ్ వేరు.
పహల్గాం ఉగ్రదాడులకు ఉగ్రవాదులు తెగబడ్డారు. ఆ తర్వాత భారత్ అందుకు ప్రతీకారంగా,పాక్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో పాక్ కూడా భారత్ పై డ్రోన్ దాడులకు తెగబడింది. అసలు భారత్ పై పాకిస్థాన్ సైనిక చర్య మొత్తం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే కొనసాగింది అంటే మీరు నమ్మగలరా.. ఈ విషాయన్ని అధికార పార్టీ మహిళా నేతచె చెప్పుకొచ్చింది.
పాకిస్తాన్ ను అణుశక్తిగా మార్చిన నవాజ్ షరీఫ్ .. ఇప్పుడు భారత్ పై మొత్తం ఆపరేషన్ ప్లాన్ చేసారు..భారత్ పై ఇటీవల పాక్ జరిపిన సైనిక చర్య మొత్తం కూడా నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే జరిగిందని అజ్మా బుఖారీ చెప్పుకొచ్చింది. నవాజ్ సాధారణ నేత కాదని, ఏదైనా చేసి చూపించే తత్వం ఆయనలో కనిపిస్తుందన్నారు. అజ్మా బుఖారీ వ్యాఖ్యలే నిజమైతే మాత్రం ప్రస్తుత ప్రభుత్వం, సైన్యం పై నవాజ్ హవా ఇంకా నడుస్తోందని చెప్పవచ్చు.
నిజానికి భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన మరుక్షణం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాడు. అయితే ఈ సమావేశానికి నవాజ్ షరీఫ్ వచ్చాడు. ప్రభుత్వంలో ఏ పదవీ లేదు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే పార్టీ అధ్యక్షుడిగా వచ్చారు అన్నారు. పైగా భారత్ విషయంలో పాక్ దూకుడు తగ్గించాలి అని చెప్పినట్లు పాక్ మీడియా చెప్పుకొచ్చింది. భారత్ తో తాను శాంతి మాత్రమే కోరుకుంటున్నట్లు నవాజ్ బిల్డప్ ఇచ్చారు. ఇరు వర్గాల మధ్య దౌత్యం నడిపేందుకు ముందుకు వచ్చినట్లు నటించారు. కాని అసలు సూత్రధారి నవాజ్ షరీఫ్ అనేది ఇప్పుడు ఆలస్యంగా తెలుస్తోంది.
నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ కు సోదరుడు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధినేత. పాకిస్థాన్ ప్రధానిగా మూడు పని చేసాడు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో దాయాది దేశంలో ఆయన ప్రధానిగా సేవలు అందిస్తున్నాడు. ఆపరేషన్ సిందూర్ తర్వాత నవాజ్ చేసిన పెర్ఫామెన్స్ నిజం అనుకోని ప్రైడ్ తెలుగు ఒక పోస్ట్ రాసుకొచ్చింది. వీలైతే ఇది కూడా చదవంది.. నటనలో షరీఫ్ కమల్ హాసన్ ను మించిపోయాడని మీరు కూడా ఒప్పుకుంటారు.