ప్రస్తుతం సమంత ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సమంతే కారణం. అలా ఎలా అంటే, గత కొంత కాలంగా ఆమె రాజ్ నిడిమోరు అనే దర్శకుడితో, తరచూ కనిపిస్తూ వస్తుంది. ఇటీవల సమంత నిర్మాణం లో వచ్చిన మొదటి చిత్రం శుభం కు, రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహించారు. దాంతో సామ్ మా మొదటి అడుగును ప్రేమతో స్వాగతించినందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అంతేనా  తరుచూ ఇలాంటి కామెంట్స్ పెడుతూ, రాజ్ ఫోటోస్ ను షేర్ చేస్తోంది. అసలే ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్. దానికి తోడు ఇలాంటి పోస్టులు.

ఇంకేముంది రాజ్ అండ్ సామ్ ఆర్ ఇన్ లవ్ అని బాలీవుడ్ టు టాలీవుడ్ మీడియా కన్ ఫామ్ చేసేంసింది. నిజానికి సమంత కంటే రాజ్ నిడిమోరు 8 ఏళ్లు పెద్ద. సమంత 1987లో పుట్టింది. ఇక రాజ్ 1979లో పుట్టాడు. ఇద్దరి మధ్య ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇక సమంత మాజీ భర్త ,టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు తనకు ఏడాది మాత్రం ఏజ్ గ్యాప్. ప్రస్తుతం రాజ్ నిడిమోరు , సమంత కలసి నివసించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారట. ఇందులో కోసం ముంబైలోనే ఫ్లాట్ చూస్తున్నారట. ఇక పెళ్లి సంగతి అంటారా.. అది ఇంకా ఖరారు కాలేదు. కాకపోతే రాజ్ నిడిమోరుకు ఆల్రెడీ పెళ్లైంది.

ఇటీవలే నిడిమోరు భార్య స్పందించింది. తన గురించి ఆలోస్తున్నవారు అందరూ బాగుండాలి అని మాత్రమే రాసుకొచ్చింది. ఇలా ఎందుకు రాసింది అనేది ఎవరికి తెలియడం లేదు. రాజ్ నిడిమోరు 2015 లోనే శ్యామాలీ అనే అసిస్టెంట్ డైరెక్టర్ తో వివాహం జరిగింది. ఆమె అంతకు ముందు రంగ్ దే బసంతి, ఓంకార లాంటి హిందీ చిత్రాలకు ఏడీగా వర్క్ చేసింది. రాజ్ తో వివాహం తర్వాత అతని మూవీస్ క్యాస్టింగ్ డైరెక్టర్ గా వ్యవహరించింది. వీరికి ఒక పాప కూడా ఉందని సమాచారం. అయితే కొంత కాలంగా వీరిద్దరు విడిపోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇంతలోనే రాజ్ లైఫ్ లోకి సమంత ఎంట్రీ ఇచ్చింది.

రాజ్ నిడిమోరు డైరెక్ట్ చేసిన ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 లో సమంత లీడ్ రోల్ చేసింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్య పెరిగిందని సమాచారం. ఆ తర్వాత సిటాడెల్, హనిబన్నీ వెబ్ సిరీస్ కోసం కలసి వర్క్ చేసారు. ఇప్పుడు కూడా ఓ హిందీ వెబ్ సిరీస్ కోసం కలసి పని చేస్తున్నారు. మరో వైపు సమంత మేనేజర్ మాత్రం రాజ్ అండ్ సమంత మధ్య ప్రేమ అనేది కేవలం రూమర్ మాత్రమే అంటున్నాడు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!