విశాల్ లవ్ స్టోరీ అనగానే, లేదా విశాల్ పెళ్లి అనగానే, ఇది మరో రూమర్ అవుతుంది అనుకున్నారు కాని, విశాల్ ఇంత సీరియస్ గా లవ్ మ్యారేజ్ కు రెడీ అవుతున్నాడని, కనీసం ఆయన అభిమానులు కూడా గెస్ చేయలేకపోయారు. గతంలో వినిపించిన పలువురు హీరోయిన్స్ పేరు పక్కనపెడితే, ఇప్పుడు ఆగస్ట్ లో ధన్సిక తో ఏడు అడుగులు వేయబోతున్న విశాల్ లవ్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఎందుకంటే వీరిద్దరి మధ్య 15 ఏళ్ల స్నేహం ఉందట. ఆ స్నేహం కొన్నాళ్ల క్రితం ప్రేమగా మారిందట. ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకెళ్తోంది. విశాల్ కంటే ధన్సిక 12 ఏళ్లు చిన్నది. విశాల్ కు ఇప్పుడు 47 ఏళ్లు. సరిగ్గా బర్త్  డే రోజున మ్యారేజ్ అంటే, అప్పటికి విశాల్ కు 48 ఏళ్లు వస్తాయి.

మరో వైపు విశాల్ మూడు ముళ్లు వేయనున్న ధన్సిక వయసు ఎంతో తెలుసా..35 ఏళ్లు. 1989 నవంబర్ 20న జన్మించింది ధన్సిక. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏజ్ గ్యాప్ అనేది పెద్ద విషయం కాదు. కాని మరీ తనకంటే 12 ఏళ్లు పెద్ద అయిన విశాల్ తో ధన్సిక ప్రేమలో పడటం, ఇప్పుడు ఏడు అడుగులు వేయడానికి నిశ్చయించుకోవడానికి మాత్రం వీరిద్దరి మధ్య ఉన్న అంతులేని ప్రేమ కారణం. వీరు తమ రిలేషన్ ను బయటపెట్టిన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో చాలా ప్రత్యేకంగా కనిపించారు. నిండా ప్రేమలో మునిగిపోయిన ప్రేమపక్షుల్లా అనిపించారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి
error: Content is protected !!