విశాల్, ధన్సిక లవ్ మ్యారేజ్, ఇఫ్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆగస్ట్ లో పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంట, అసలు ఎప్పుడు, ఎక్కడ , ఎలా ప్రేమలో పడ్డారు అనేది, తెల్సుకునేందుకు చాలా క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఎందుకంటే విశాల్ జీవితంలో చాలా ప్రేమకథలు ఉన్నాయి. కాని ఈ ప్రేమ కథ మాత్రమే పెళ్లి పీటల వరకు తీసుకొచ్చింది. నిజానికి 15 ఏళ్లుగా విశాల్ కు, ధన్సికకు పరిచయం ఉంది. కాకపోతే అది హాయ్ బాయ్ స్నేహం మాత్రం.

అయితే ఒక ఇండస్ట్రీలో ఉండటంతో, ఏదో ఒక సమయంలో కొన్ని సమస్యల గురించి చర్చించుకుంటారు. అలా తన ఇంట్లో సమస్యను ఒక సారి విశాల్ కు వివరించింది ధన్సిక. ఇప్పుడు విశాల్ ఆ సమస్యను పరిష్కరించేందుకు తన ఇంటి వరకు వచ్చాడట. సమస్య అని కాదు కాని, అతని మంచితనం ఆరోజు అర్ధమైంది. ఆ తర్వాతి రోజు నుంచి ఒకరిని మరొకరం అర్ధం చేసుకోవడం పై నిమగ్నమయ్యాం. మళ్లీ ప్రేమలో పడ్డాం. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం అని సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది ధన్సిక

ఇక విశాల్ కూడా తన ప్రేమ వ్యవహారం ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించడం ఒక భారం. ఇక మీడియాకు తెలియకుండా ఇనాళ్లు జాగ్రత్త పడ్డాం, ఇది ఇంకో భారం.. ప్రస్తుతం ఈ భారాల నుంచి తాను తప్పించుకున్నట్లు, ఇక పై ప్రశాంతంగా ఉంటానని, తమ పెళ్లికి అందర్ని ఆహ్వానిస్తానని ఆనందంగా చెప్పుకొచ్చాడు విశాల్.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!