
పెళ్లి పేరుతో మోసం, ఇలాంటి మోసాలు గతంలో చాలానే విన్నాం, కాని రాజస్థాన్ కు చెందిన అనురాధ పాసవాన్ మాత్రం, ఈ విషయంలో పీహెచ్ డీ చేసింది. కేవలం డబ్బు, నగదు లక్ష్యంగా, కోసం ఏకంగా 25 మందిని పెళ్లాడింది ఈ మహిళ. పెళ్లి జరిగే తీరు, పెళ్లి తర్వాత జరిగే దొంగతనం, ఎప్పుడు సేమ్ ఫార్మాట్ లో జరుగుతుండేది, కాని ఎల్లకాలం మోసం సాగదు కదా.. 26వ పెళ్లి కోడుకు తాను మోసపోయాను అంటూ, పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. వాళ్లు కూపీ లాకి, వల వేసి, ఈ కిలేడీని పట్టుకున్నారు.
నేను ఒక ఒంటరి మహిళను, ఒక సోదురుడు ఉన్నాడు కాని, ఉద్యోగం చేయడు, డబ్బులు సంపాదించడు. నేను పేదరాలిని అంటూ అందరికి చెప్పుకునేది, ఎవరైనా ఆసక్తిగా ఉంటే, తనపై ప్రేమ కురిపిస్తే, వెంటనే తన గ్యాంగ్ నుంచి ఒకర్ని రంగంలోకి దింపి, పెళ్లి సంబంధం మాట్లాడేది. అసలే అందమైన అమ్మాయి, ఆపైన పుట్టెడు కష్టాలు. దాంతో జీవితం ఇద్దాం అనుకున్న మగవాళ్ల పరిస్థితి, దారుణంగా మారుతుంది. జీవితం దుర్భరంగా మారుతుంది. అసలు ఆమెకు జీవితం ఇద్దాం అనుకున్న ఆలోచన ఎందుకు వచ్చిందని విరక్తి పుడుతుంది,.
ఎందుకంటే పెళ్లి అవుతుంది. మూడు రాత్రులు గడుస్తాయి. అ తర్వాత అత్తారింట్లో ఏం నగలు ఉన్నాయో, డబ్బులు ఎక్కడ దాచారో, విలువైన వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని తెలుసుకుంటుంది అనురాధ .అదును చూసి ఇంట్లో వారి మత్తు మందు కలిపి వారు గాఢ నిద్రలోకి జారుకోగానే, తన గ్యాంగ్ ను రంగంలోకి దింపుతుంది. మొత్తం దోచుకుని వెళ్లిపోతుంది.
తెల్లారి లేచి చూస్తే పెళ్లి కూతురు ఉండదు. ఇంట్లో డబ్బులు ఉండలు. నగలు మాయం అవుతాయి. మోసపోయం అనే విషయం అర్ధమవుతుంది. ఇలా 25 మంది మోసపోయారు. అనురాధా అనే పేరు వినిపిస్తేనే ఉలిక్కి పడతారు. సారీ ఈ 25 మందికి కూడా తన ఓరిజినల్ నేమ్ తెలియదు. అంతా ఫేక్ . చెప్పిన పేరు, పరిచయం చేసిన కుటుంబ సభ్యుడి పేరు, ఇంటి పేరు, అడ్రస్, సర్టిఫికెట్లు అంతా కూడా ఫేక్. ఎవరైనా ఏం చేస్తారు..ఏమని చెబుతారు.
కాని ఒక్క పెళ్లి కొడుకు జరిగిన మోసాన్నిమొత్తాని తీసుకెళ్లి పోలీసులకు చెప్పారు. కాని పోలీసులకు కూడా అనురాధా అంత ఈజీగా చిక్కలేదు. కిలేడీ పాసవాన్ ను పట్టుకునేందుకు, పోలీసులు చాలా కష్టపడ్డారు. తన దారిలోనే వెళ్లారు. పెళ్లి సంబంధం మాట్లాడినట్లే మాట్లాడి, గ్యాంగ్ తో సహా హోల్ సేల్ గా పట్టుకున్నారు. నిత్య పెళ్లి కూతురు పట్టుబడటంతో, గతంలో తనని పెళ్లి చేసుకోని మోసపోయిన బ్యాచ్ అంతా బయటికి వచ్చి, గగ్గోలు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి