
మే 20 ఎన్టీఆర్ బర్త్ డే. అందుకే హిందీ ఇండస్ట్రీ బిగ్ ప్రొడక్షన్ హౌజ్, వారు నిర్మిస్తోన్న వార్ -2 టీజర్ ను రిలీజ్ చేసింది. వార్ అంటే యశ్ రాజ్ స్పై యూనివర్స్. ఈ యూనివర్స్ నుంచి వచ్చిన స్పైస్ అందరూ వందల కోట్లు కొల్లగొట్టారు బాలీవుడ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించారు. అలాంటి సిరీస్ లోకి, అలాంటి యూనివర్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టాడు. మరి అలాంటి అప్పుడు ఎలాంటి అంచనాలు ఉంటాయి. కాని వార్ -2 టీజర్ చూస్తే వార్ వన్ టీజర్ కు కాపీ పేస్ట్ లాగే ఉంది. నిజానికి ఇంకాస్త క్లారిటీగా చెప్పుకోవాల్సి వస్తే వార్ వన్ టీజర్ చాలా బెటర్ . చాలా స్టైలిష్ గా కనిపించింది.
వార్ -2లో స్టైల్ ఉంది, యాక్షన్ ఉంది, భారీ తనం ఉంది, కళ్లు చెదిరే విజువల్స్ ఉన్నాయి , కాని వావ్ ఫ్యాక్టర్ మిస్ అయింది. ఎన్టీఆర్ నటిస్తోన్న ఫస్ట్ హిందీ మూవీ అంటే ఎలా ఉండాలి.. కాని ఈ టీజర్ లో ఎన్టీఆర్ ను అద్బుతంగా చూపించిన ఒక్క షాట్ కూడా లేదు. ఇంకా అంతో ఇంతో హృతిక్ తన ఛరిష్మాతో మరోసారి మ్యాజిక్ చేసాడు. కాని ఎన్టీఆర్ కు మాత్రం టీజర్ లో ఆ స్కోప్ లేదు. టీజర్ పై విశ్లేషణ అనవసరం. కాని వార్ -2 లాంటి అతిపెద్ద సినిమాకు మాత్రం ఇది అవసరం. ఎన్టీఆర్ ను ఇంకాస్త బాగా చూపించాల్సింది అనేది సగటు టైగర్ అభిమాని ఆరాటం అంతే..
ఏది ఏమైనా ఆగస్ట్ 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాన్ని తీసిన అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. పైగా యశ్ రాజ్ బ్యానర్ బ్రాండ్ వాల్యు గురించి తెల్సిందే. తప్పకుండా ఎన్టీఆర్ అభిమానులను వారు సాటిస్ ఫై చేయడం ఖాయం అని ప్రైడ్ తెలుగు నమ్మకం. ఏవే హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ ఎన్టీఆర్. మీ బాలీవుడ్ ప్రయాణం ఈ టీజర్ తో ప్రారంభం అయింది.అందుకు ఆల్ ది బెస్ట్
ఇవి కూడా చదవండి