
యశ్ రాజ్ ఫిల్మ్స్ అంటే ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థ. హిందీ ఇండస్ట్రీలో 50 ఏళ్లకు పైగా సినిమాలు నిర్మిస్తోన్న సంస్థ. అన్నిటికంటే మించి బాలీవుడ్ కు అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. షారుఖ్ ను స్టార్ ను చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఈ బ్యానర్ కు చరిత్రే ఉంది. కాని ఎన్టీఆర్ ను హిందీలో లాంఛ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం, యశ్ రాజ్ ఫిల్మ్స్ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. లేకపోతే వార్ -2 టీజర్ పై అంత నెగిటివిటీ ఎందుకు వస్తుంది.
కొందరికి టీజర్ నచ్చలేదు. మరికొందరికి టీజర్ లో హృజిక్ మాత్రమే హైలైట్ అయ్యాడు అనే కోపం పుట్టుకొచ్చింది, ఇంకొందరికి గ్రాఫిక్స్ కంప్లైంట్, ఇలా చెప్పుకుంటూ పోతే, సోషల్ మీడియా మొత్తం కూడా వార్ -2 టీజర్ బాగోలేదనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇది ఓ విధంగా టాలీవుడ్ కు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి.
వార్ -2లో ఎన్టీఆర్ మరో విధంగా ఊహించున్నాం, కాని యశ్ రాజ్ ఫిల్మ్స్, లేదా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మరో విధంగా చూపించారని, ఇది అస్సలు నచ్చలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనపడుతున్నాయి. ఇక బాడీ డబుల్ డిస్కషన్ అయితే టాప్ లెవల్లో ఉంది.
కాని బాలీవుడ్ లో ఒక సినిమా చేయాలి అంటే అందుకు యశ్ రాజ్ సంస్థను మించిన నిర్మాణ సంస్థ ఏముంటుంది? ఈ విషయంలో , ఎన్టీఆర్ ను తప్పు పట్టలేం, అతను తీసుకున్న తీసుకున్న సరైనదే, కాని యశ్ రాజ్ టైగర్ ను చూపించిన విధానమే అంచనాలను అందుకోలేకపోయింది. కనీసం సినిమా రిలీజ్ సమయానికి అయినా యశ్ రాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సాటిస్ ఫై చేసే విధంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ఆశిద్దాం.
ఇవి కూడా చదవండి