తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది దర్శకులు అయినా ఉండవనివ్వండి. త్రివిక్రమ్ క్రేజ్ త్రివిక్రమ్ దే.. ఆయన సినిమాలు, ఆయన మాటలు, ఆయన దర్శకత్వం, పవన్ కు సాన్నిహిత్యం, అన్నికూడా  ప్రత్యేకమే.. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే టాలీవుడ్ కు అంత ఇంట్రెస్ట్.

అలాంటి దర్శకుడు గుంటూరు కారం తర్వాత మెగా ఫోన్ కు దూరంగా ఉండిపోయాడు. అంటే 20 నెలల నుంచి సినిమా లేదు. ఈ లోపు చాలా మార్పులు జరిగిపోయాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మూవీ చేయాలి. అది కూడా మైథాలజీ మూవీ. కాని ఎందుకో అల్లు అర్జున్ తప్పుకున్నాడు. ఎన్టీఆర్ వచ్చేసాడు. కాని ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ మూవీ ఉంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ తో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు త్రివిక్రమ్. ఆగస్ట్ లో సినిమాను ఘనంగా ప్రారంభించారు. సెప్టెంబర్ అంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. ఇప్పుడు సినిమా చిత్రీకరణ కూడా షురూ అయింది.

శ్రీనిధి శెట్టి, మీనాక్షి  చౌదరీ హీరోయిన్స్ గా నటిస్తారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాదే ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి మూవీస్ కు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. అప్పట్లో త్రివిక్రమ్ మాటలు భలేగా పేలాయి. దీంతో త్రివిక్రమ్, వెంకటేష్ మూవీ కోసం టాలీవుడ్ ఏళ్లుగా ఎదురు చూసింది. ఇప్పుడు ఆ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయింది. మరోసారి వీరు పండించే హాస్యానికి తెలుగు సినీ పరిశ్రమలో నవ్వుల తుఫాన్ పుట్టుకురావడం ఖాయం.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!