
టాలీవుడ్ లో సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. చిన్నా పెద్ద సినిమాలకు తగ్గట్లు, ఏ హీరో ఇమేజ్ కు తగ్గట్లు, ఏ నిర్మాత స్థాయికి తగ్గట్లు, అలా సీక్వెల్స్ తీస్తూ వెళ్తున్నారు. ఈ లిస్ట్ లో నాని కూడా చేరిపోయాడు. తన నిర్మాణంలో వచ్చిన హిట్ -1 అండ్ హిట్ -2 సినిమాలకు, ఇప్పుడు హిట్ -3 తీస్తున్నాడు. పైగా ఈసారి మూడో భాగంలో తానే హీరోగా నటిస్తున్నాడు. మే 1న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన శైలేష్ కొలను మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఒక సిరీస్ లో మూడు భాగాలు వచ్చినప్పుడు, నాలుగో భాగం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కదా..అలాంటి స్కోప్ హిట్ కు ఉంది.అందుకే హిట్ -4కు హీరో లాక్ అయ్యాడని,హిట్ -3 క్లైమాక్స్ లో ఆ హీరోను రివీల్ చేస్తారని ప్రచారం సాగుతోంది.

హిట్ -4 లో పోలీస్ ఆఫీసర్ గా మాస్ రాజా రవితేజ నటించే అవకాశాలు ఉన్నాయట.నిజానికి నానికి, రవితేజకు మంచి స్నేహం ఉంది.ఇద్దరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్లుగా నిలిచిన వాళ్లే..అందుకే హిట్ -4లోకి మాస్ రాజా అడుగుపెడుతున్నాడని,తనదైన స్టైల్లో ఓ కేస్ ను డీల్ చేయనున్నాడని టాక్.అసలు నాని హిట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడే,హిట్ -10వరకు సినిమాలు తీసి,హిట్ -10 , అప్పటి వరకు హిట్ లో కనిపించిన హీరోలందరితో కలపి హిట్ మల్టీస్టారర్ చేయాలనే ప్లాన్ ఉంది అన్నాడు. అందులో భాగంగానే హిట్ -4 కూడా ఉంటుంది. అలాగే హిట్ -5 కూడా ఉంటుందట.
