JohnAbraham Replaced PrithvirajSukumaran in SSMB29

రాజమౌళి సినిమాలో హీరో పేరు..

మహేష్ బాబు కు పవర్ ఫుల్ పేరు..

రూమర్ నిజమవుతుందా.. అదే పేరు లాక్ అవుతుందా?

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న సినిమా షుటింగ్, గప్ చుప్ గా జరుగుతోంది. కనీసం సినిమా షూటింగ్ ప్రారంభమైందని రాజమౌళి కాని, నిర్మాతలు కాని చెప్పడం లేదు. కాని షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారని టాక్ ఉంది. అదే సమయంలో ఈ సినిమాపై రూమర్లు ఆగడం  లేదు. హీరో మహేష్ బాబు అని మాత్రమే తెలుసు. హీరోయిన్ ప్రియాంక చోప్రా అని ప్రచారం సాగుతోంది. అలాగే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ కన్ ఫామ్ అయిందని టాక్ వినిపిస్తోంది.ఏది కూడా క్లారిటీ లేదు. కాకపోతే వీరందరూ ఒకే చోట మాత్రం కనిపిస్తున్నారు.

అందుకే ఈ రూమర్స్ లో అంతో ఇంతో నిజం ఉందని నమ్మేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే రూమర్స్ లిస్ట్ లో మరొకటి చేరింది. అదే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు.. మూవీలో ప్రిన్స్ రుద్రగా కనిపించబోతున్నాడట. జంగిల్ అడ్వెంచర్ అంటున్నాడు. మళ్లీ రుద్ర అనే పేరు పెడుతున్నాడు. ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉందా అనేది తెలియాల్సి ఉంది. కాని రాజమౌళి క్లారిటీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఏప్రిల్లో ఈ సినిమా గురించి రాజమౌళి ప్రెస్ మీట్ పెడతాడు అని ప్రచారం సాగుతోంది. మరి ఆరోజైనా ఈ రూమర్ పై క్లారిటీ వస్తుందా లేదా అన్నది చూడాల్సిం ఉంది.

error: Content is protected !!