
ప్రేక్షకులకు వినోదం అందించడం అనేది ఒక నటుడి పని. అంతకు మించినది ఏది కూడా తనకు అనవసరం. ఎందుకంటే తన జీవితం, తన ఆరోగ్యం, తన కుటుంబం అంటూ ఉన్నాయి. మరి అవి ముఖ్యం కాని, వినోదం పేరుతో, ప్రేక్షకులను కొత్తదనం అందించాలనే తాపత్రయంతో, హీరోలు చేస్తోన్న ప్రయోగాలు కొన్ని సార్లు చేటు చేస్తున్నాయి.
ఇప్పుడు ఎన్టీఆర్ సన్నబడిన విధానం చూస్తే, ఒక సినిమాకు తన ఒంటిని ఇంతగా కష్టపెట్టుకోవడం అవసరమా అనిపిస్తోంది. మొహంలో మునుపటి కళే లేదు. పూర్తిగా వెయిట్ తగ్గిపోయాడు. బక్క పలచగా కనిపిస్తున్నాడు. ఇదే అదునుగా సోషల్ మీడియాలో , మరికొన్ని యూట్యూబ్ లో ఛానల్స్ లో, ఎన్టీఆర్ కు ఏదో అయిపోయిందని, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాడని తప్పుగా రాస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం.
ఏప్రిల్ 22న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న కొత్త చిత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అందుకోసమే భారీగా వెయిట్ తగ్గాడు. మరి నీల్ ఏం ప్లాన్ చేసాడో తెలియదు. ఈ లుక్స్ మాత్రం ఈ సారి ఫ్యాన్స్ ను వర్రీని తీసుకొస్తున్నాయి. ఒక్క సారి సినిమా రిలీజైన రోజున, ఎన్టీఆర్ లుక్ అదిరిపోతే ఓకే లేదా, తారక్ పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది.