ఎన్టీఆర్ అంటే  ఇంకా పాన్ ఇండియా అనుకుంటే ఎట్టా.. ఎన్టీఆర్ అంటే పాన్ ఇంటర్నేషనల్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ దాటి, ఎన్టీఆర్ జపాన్ మర్కెట్ లోనూ స్టార్ అయిపోయాడు. అతను నటించిన దేవర ను కొద్ది గంటల క్రితం అక్కడ విడుదల చేయగా, జపనీయులు ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. దాంతో రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా ఎన్టీఆర్ స్టార్ డమ్ హాట్ టాపిక్ గా మారింది.

కొరటాల డైరెక్ట్ చేసిన దేవర లాస్ట్ ఇయర్ రిలీజై 500 కోట్ల వరకు రాబట్టిందని మేకర్స్ తెలిపారు. ఇప్పుడు జపాన్ లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో, ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్, జపాన్ లో సంచలన విజయం సాధించింది. పైగా అంతకు ముందు కూడా జపాన్ దేశస్థులకు ఎన్టీఆర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. రజనీకాంత్ తర్వాత ఎన్టీఆర్ సినిమాలను ఎప్పటి నుంచే జపనీయలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు అదే ఆదరణ మరో స్థాయికి వెళ్లింది. ఎన్టీఆర్ కు టాలీవుడ్  తర్వాత బాగా ఆదరిస్తోన్న ఇండస్ట్రీగా జపాన్ మారింది అంటే అతిశయోక్తి లేదు.

error: Content is protected !!