మర్డర్ థ్రిల్లర్స్ లో జానర్ లో వచ్చే సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ముందు థియేటర్స్ లో ఆడియెన్స్ రప్పిస్తాయి. ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ స్టార్ట్ అయితే, అదే రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిఫరెంట్ కూడా అలాంటి చిత్రమే. టైటిల్ లో డిఫరెంట్ ఉన్న సినిమా, అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నిజంగా మూవీ డిఫరెంట్ గా ఉందా? లేదా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు పెట్టారా అనేది రివ్యూ లో చూద్దాం రండి.

స్టోరీ

న్యూజీల్యాండ్ నేపథ్యంలో కథ ప్రారంభం అవుతుంది. అందమైన దేశంలో అందమైన యువతులు వరుసగా హత్యకు గురవుతుంటారు. ఇక్కడే క్యూరియాసిటీ ప్రారంభం అవుతుంది.
ఆ తర్వాత కథలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. అతను ఎవరో కాదు, నితిన్ నాష్. చాలా వరకు ఒంటరిగా ఉంటాడు. అమ్మతో కలసి తన పని తాను చేసుకుంటాడు. ఇంతలో సిటీలో సైకో తిరుగుతున్నాడని పోలీసులు అప్రమత్తం చేస్తారు. వరుసగా హత్యలకు సైకోనే కారణం అనుకుంటుండగా, నితిన్ నాష్ ఇంట్లోకి ముగ్గురు అమ్మాయిలు ప్రవేశించి, హత్యకు చేసేందుకు ప్రయత్నిస్తారు. సిటీలో వరుస హత్యలేంటి, నితిన్ నాష్ సింగిల్ గా ఎందుకు ఉంటున్నాడు.

అతని తల్లిగా నటించిన సన , ఆ ఇంట్లోనే ఏం చేస్తోంది. ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు.. ఇదంతా తెలియాలి అంటే , ఇంత డిఫరెంట్ గా ఉన్న స్టోరీ మరింత డెప్త్ గా తెల్సుకోవాలంటే, మీరు సినిమా చూడాల్సిందే.


స్క్రీన్ ప్లే , దర్శకత్వం, ఇతర విభాగాలు

ఒకే ఇంట్లో జరిగే కథ ఇది. ఇలాంటి కథకు 24 విభాగాలు అత్యుత్తమంగా పని చేస్తే, అవుట్ పుట్ ఆసక్తికరంగా వస్తుంది. నటీనటుల ఎంపిక, ఇల్లు, సినిమాటోగ్రఫీ , స్క్రీన్ ప్లే, ఇలా డిఫరెంట్ వర్క్ చేసిన టీమ్ పర్ఫెక్ట్ గా పని చేసింది. అందుకే ఒకే ఇంట్లో జరిగిన కథే అయినా,
ఎక్కడా కూడా స్క్రీన్ ప్లే పట్టుతప్పలేదు. సినిమా అంతా కూడా ఆశక్తిగా సాగింది. ఈ విషయంలో దర్శకుడు డ్రాగన్ ఉదయ్ భాస్కర్ పని తీరును మెచ్చుకుని తీరాల్సిందే. ఎన్. ఎస్.వి.డి శంకర్ రావు నిర్మాణ విలువలు మరో స్థాయిలో ఉన్నాయి. ఇక నిహల్ సంగీతం సినిమాకు ఆధ్యాతం ఆసక్తికరంగా మార్చింది.

కెమెరామెన్ భాస్కర్ వర్క్ బాగా కుదిరింది. చూస్తే లో బడ్జెట్ మూవీ స్టోరీ అయినా, అద్భుతమైన టేకింగ్ తో డిఫరెంట్ మూవీ, టైటిల్ జస్టిఫై చేసే విధంగా వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది అని చెప్పవచ్చు. ఎన్ నాష్, ఆజీజ్, ప్రట్టీ జో, సన ఇతర నటీ నటులు కథకు తగ్గట్లుగా నటించి, సినిమాను రక్తి కట్టించారు.

ప్రైడ్ తెలుగు సినిమా రేటింగ్

ఒకే రూమ్ లో సాగే మర్డర్ మిస్టరీనే అయినా, దర్శకుడు మూవీని డీల్ చేసిన విధానం, డిఫరెంట్ ను డిఫరెంట్ గా నిలిపింది. ఈ జానర్ లో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ బాగుంటుంది. డిఫరెంట్ కూడా బాగా తెరకెక్కడంతో ప్రేక్షకులు బాగానే ఆదరించే అవకాశాలు ఉన్నాయి. థ్రిల్లర్స్ ను లైక్ చేసేవారు తప్పకుండా డిఫరెంట్ చూడాల్సిందే.

ఈ సినిమాకు ప్రైడ్ తెలుగు ఇస్తోన్న రేటింగ్ 3/5

error: Content is protected !!