మళ్లీ షూటింగ్ కు పుష్పరాజ్ రెడీ అంటే, పుష్ప -3 కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడా అని ఆశ్చర్యపోకండి.అందుకు ఇంకా సమయం ఉంది. ముందు తమిళ దర్శకుడు అట్లీతో మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ తో చిత్రం పూర్తి కావాలి. అప్పుడు , పుష్ప-3 షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

అందుకు ఇంకా ఈజీగా నాలుగేళ్లు పట్టవచ్చు. ఈ లోపు పుష్ప- 2 తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రం గురించి మాట్లాడుకుందాం. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో భారీ చిత్రం చేస్తున్నాడు అర్జున్. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను ఇటీవలే విడుదల చేసారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే ఆశక్తి అభిమానుల్లో ఉంది.

అయితే అందుకు సంబంధించిన పనుల్లోనే అట్లీ,అల్లు అర్జున్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ముంబైలో లుక్ టెస్ట్ నిర్వహించారట. ఈ సినిమాలో బన్ని, మూడు పాత్రలు చేస్తున్నాడని సమాచారం. జాన్వీ కపూర్, దిశాపటాని, సమంత హీరోయిన్స్ గా నటిస్తారట. సాయి అభ్యంకర్ అని తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. అతను సంగీతం అందించబోతున్నాడు. వచ్చే జూన్ నుంచే అల్లు అర్జున్, అట్లీ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.

నెక్ట్స్ ఇయర్ డిసెంబర్ కు మూవీని రిలీజ్ చేయాలని అల్లు అర్జున్ పట్టుమీద ఉన్నాడట. పుష్ప వన్ , పుష్ప టూ రెండూ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందుకే అట్లీ మూవీని కూడా డిసెంబర్ లోనే విడుదల చేయాలి అంటున్నాడట.

error: Content is protected !!