మెళ్లిగా కోలీవుడ్ మార్కెట్ ను కబ్జ చేసి పారేస్తున్నాడు శివకార్తికేయన్. పదేళ్ల క్రితం యంగ్ హీరోగా వెలిగిన శివకార్తికేయన్ వరుస విజయాలతో, అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తో స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం సూర్య, విక్రమ్, శింబు లాంటి స్టార్స్ ను దాటేసి వసూళ్లను కొల్లగొడుతున్నాడు. దాంతో తమిళ దర్శకులు అందరూ శివ జపం చేస్తున్నారు.

ఇప్పటికే మురగదాస్ మదరాశి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరో వైపు సుధ కొంగర సూర్యతో తీయాల్సిన మూవీని, ప్రస్తుతం పరాశక్తి పేరుతో శివకార్తికేయన్ తో తెరకెక్కిస్తోంది. ఇవి కాకుండా గుడ్ నైట్ డైరెక్టర్ తో మూవీ లైన్ లో ఉంది.

ఇప్పుడు రెట్రో దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో శివకార్తికేయన్ మూవీ చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కార్తిక్ తెరకెక్కించే సినిమాలకు కోలీవుడ్ లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు శివకార్తికేయన్ తో సినిమా అంటే ఈ ప్రాజెక్ట్ తప్పకుండా శివను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లడం ఖాయం.

error: Content is protected !!