తమిళ నటుడు సూర్య వేగం, ఇప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కంగువ ఫెయిల్యూర్ తర్వాత, సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు సూర్య. ఇది తెల్సిన విషయమే కొత్తగా ఏదైనా చెప్పండి అంటారా.. అయితే, ఈసారి సూర్య ఏ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు అనేది తెలిస్తే మీరు షాక్ అవుతారు.

ఎందుకంటే ఆ దర్శకుడు స్టార్ డైరెక్టర్ కాదు, కనీసం కెరీర్ లో భారీ విజయాన్ని కూడా చూడలేదు. అయినా సరే,అతనికి అవకాశం ఇచ్చాడు. పైగా అతను పూర్తి స్థాయి కథ కూడా చెప్పలేదు. కేవలం లైన్ మాత్రమే చెప్పడంతో ఇంప్రెస్ అయ్యాడట సూర్య. త్వరలో పూర్తి కథను సిద్ధం చేసుకొస్తే సినిమా చేసి పెడతాను అని మాట ఇచ్చాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా… మాండాడి అనే చిత్రాన్ని తీసిన మేకర్ మత్తిమారన్ అట. ఈ విషయాన్ని తమిళ మీడియా లీక్ ఇచ్చింది.

మత్తిమారన్ దర్శకత్వంలో..?

ఒకప్పుడు సూర్యతో సినిమా అంటే మామూలుగా ఉండదు. కథ కాదు కదా కనీసం లైన్ ఒకే చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో సూర్య అంచనాలు పెట్టుకునే వాడు. క్యారెక్టర్ విషయంలో నెక్ట్స్ లెవల్లో ఉండాలి అనుకునేవాడు. కాని ఇఫ్పుడు అలాంటి కండీషన్స్ పెట్టుకోవడం లేదు.

కొత్త చిత్రాలు..

చిన్న చిన్న కథలు అయినా సరే, తన ఇమేజ్ సరిపోతుంది అనుకుంటే సింపుల్‌గా చేసేస్తున్నాడు. అందులో భాగంగానే కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్, జీతు మాధవన్ , జ్ఞానవేల్ చిత్రాలు తెరకెక్కాయి. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడితో చిత్రం చేస్తున్నాడు సూర్య. ఇందులో తమిళనాడులో ఫేమస్ 5 రూపాయల డాక్టర్ పాత్రను చేస్తున్నాడు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ చిత్రం తర్వాత జన నాయకుడు దర్శకుడు వినోద్ మేకింగ్‌లో సూర్య సినిమా చేయబోతున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో డీసీ ఫేమ్ వామికా హీరోయిన్ గా నటించనుంది. అలాగే సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించబోతున్నాడట.

ఇవి కాకుండా సూర్య కోసం మురుగదాస్ ఒక కథను రాస్తుండగా, శంకర్ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం మొదలైంది. మరో వైపు తన కెరీర్ లో 50వ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రోలెక్స్ మూవీతో తిరిగొస్తాడట. మొత్తంగా సూర్య చూపిస్తోన్న స్పీడ్, గత పదేళ్లలో చూపించి ఉంటే, ఈ పాటికి విజయ్ స్థాయిలో తమిళ నాట అగ్ర హీరోగా ఎదిగి ఉండేవాడని ఆయన అభిమానులే చెప్పుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!