మారడం లేదు..

అల్లు అర్జున్ హైదరాబాద్ విడిచి ముంబై వెళ్లడం లేదని, బన్నికి హైదరాబాద్‌ అంటే ప్రేమ అని, ఇక్కడే తనకు కుటుంబం, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు ఉన్నారని, కాబట్టి ముంబైకి ఐకాన్ స్టార్ షిఫ్ట్ అవుతున్నారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని,అల్లు అరవింద్ చెప్పినప్పటికీ..

మారుతున్నాను..

అల్లు అర్జున్ మాత్రం ముంబైకి మకాం మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే అక్కడ అంటే జుహు ప్రాంతంలో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను లీజ్‌కు తీసుకున్నట్లు సమాచారం.ఆరు వేల చదరపు అడుగులున్న ఈ లగ్జరీ ఫ్లాట్ రెంట్ నెలకు 16 లక్షలు అని సమాచారం. ముంబైలో షూటింగ్స్ ఉన్నప్పుడు ఇదే ఫ్లాట్‌ను ఉపయోగించనున్నాడు బన్ని. పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు, ముంబైలో వెకేషన్ ప్లాన్ చేసినప్పుడు, కుటంబం మొత్తం ఇక్కడికే రానుంది.

హైదరాబాద్‌లో ఇంద్రభవనం

ప్రస్తుతం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఏరియాలో, బాలకృష్ణ ఇంటి వెనుక అల్లు అర్జున్ భవనం ఉంది. ఇప్పుడు చిరంజీవి ఇంటికి దగ్గర్లో అల్లు అర్జున్ నూతన గృహం నిర్మించబోతున్నాడని ప్రచారం సాగుతోంది. దాదాపు 80 కోట్లతో కొత్త ఇంటిని సకల వసతులతో ఇంద్రభవనం స్థాయిలో నిర్మిస్తారట.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!