
మెగా పవర్ స్టార్, రామ్ చరణ్ నటిస్తోన్న కొత్త చిత్రం పెద్ది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాకు సంబంధించి కీలకమైన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు. సినిమా మొత్తం వేరు, ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న యాక్షన్ ఎపిసోడ్ వేరని, చిత్ర యూనిట్ చెబుతోంది. ట్రైన్ ఎపిసోడ్ నేపథ్యంలో సీన్స్, రామ్ చరణ్ నటన, సినిమా రిలీజ్ రోజున గూస్ బంబ్స్ తెప్పిస్తుందట. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్ వేసినట్లు చెబుతున్నారు. చరణ్ చాలా రిస్కీ స్టంట్స్ చేసాడని చెబుతున్నారు.
జూన్ 19 వరకు, ఈ షెడ్యూల్ కొనసాగనుందని సమాచారం. ఇప్పటికే సెట్ నుంచి బయటికి వచ్చిన, ఆన్ లోకేషన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ పవర్ ఫుల్ లుక్ ఏదైతే ఉందో, అది మెగా ఫ్యాన్స్ కు నిద్రను దూరం చేస్తోందని చెప్పవచ్చు. వచ్చే ఏడాది మార్చిలో, పెద్ది రిలీజ్ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి