
మూడేళ్ల క్రితం వచ్చిన కన్నడ సినిమా సంచలనం కాంతార, గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది.. 15 కోట్లు పెట్టి తీస్తే, సినిమా కథకు పాన్ ఇండియా ఆడియెన్స్ కనెక్ట్ అయ్యి, సరాసరి 500కోట్లు కురిపించారు. అలాంటి సినిమాకు ఇప్పుడు పీక్వెల్ తీసుకొస్తున్నాడు , రిషబ్ శెట్టి. నిజానికి కాంతార-2 అక్టోబర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడు వాయిదా పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు ఈ సినిమా షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడమే రీజన్ గా చెప్పుకొస్తున్నారు. పైగా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాలు కూడా వాయిదా పడటానికి కారణం అట.
మొత్తంగా కాంతార 2 కోసం ఎదురు చూస్తోన్న ప్రేక్షకులకు మరింత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. మొదటి భాగాన్ని 15 కోట్లు పెట్టి తీస్తే, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సినిమాను దాదాపు 125 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. అక్టోబర్ లో సినిమా విడుదల పోస్ట్ పోన్ అయితే ఇక వేసవిలోనే కాంతార 2 విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రీక్వెల్ మూవీకి కూడా రిషబ్ శెట్టినే దర్శకుడు.
- తమిళనాట విజయ్ మరో సంచలనం, సీఎం కేక్స్ కోసం ఎగబడుతున్న జనం
- పవన్ దారిలో బన్ని భుజానికి గాయం, కాని ఇప్పుడు కాదు…
- వద్దు.. వద్దు.. అలా చేయవద్దు, బాలయ్య హీరోయిన్ విజ్ఞప్తి
- 6 టీన్స్ కు సీక్వెల్, రిస్క్ మూవీ ఎలా ఉంది?
- కాంచనలోకి చంద్రముఖి హీరోయిన్, లారెన్స్ గేమ్ ఛేంజింగ్ ప్లాన్
