
తమిళనాడు సీఎం ఏంటి, సంచలనం ఏంటి, సీఎం కేక్స్ ఏంటి అనుకుంటున్నారా.. అదే కదా .. స్టోరీ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందని, ప్రైడ్ తెలుగు దీనిపై ఫోకస్ పెట్టింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, తమిళనాడు కొత్త సీఎం విజయ్, తనదైన పాలనతో ప్రజల మనసు దోచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ అభిమానం అంతా ప్రజలు ఎలా చూపిస్తున్నారో తెలుసా, బేకరీల్లో కేక్స్ కొంటున్నారు. దళపతి జిందాబాద్ అంటున్నారు. ఇటీవల విజయ్ పుట్టిన రోజున, త్రిష ఒక ఫోటో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ ఫోటోలో మ్యాంగో వెనిలా కేక్ ఉంది చూడండి, అదే కేక్‌ను ఇప్పుడు తమిళనాడులో అధికంగా కొనుగోలు చేస్తున్నారట. ఈ విషయాన్ని బేకర్ తన్వి బొకారియా ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. నిజానికి విజయ్ బర్త్ డే కోసం మ్యాంగో వెనిలా కేక్ ఆర్డర్ చేసారని తమకు తెలియదని, ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయమని అన్నాడు బేకర్. గత రెండు వారాల్లో మ్యాంగే వెనిలా కేక్స్ విపరీతంగా అమ్ముడుపోయాని, కష్టమర్స్ నేరుగా వచ్చి, సీఎం కేక్ కావాలని అడుగుతున్నారట. దీంతో చాలా బేకరీల్లో ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటున్నాయట.
ఈ కేక్‌కు ఇంత క్రేజ్ రావడానికి మరో రీజన్, విజయ్, త్రిష మధ్య ఉన్న రిలేషన్. తమిళనాట గిల్లీ జోడీకి ఉన్న పాపులారిటీ కూడా ఈ కేక్ రేంజ్‌ను పెంచేస్తోంది. మొత్తంగా తమిళనాడులో సీఎం విజయ్ క్రేజ్ ఎలా ఉంది అని చెప్పడానికి ఈ కేక్ స్టోరీ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
