
అల్లు అర్జున్‌కు ఏం అయింది.. భుజానికి ఎప్పుడు గాయం అయింది అని కంగారు పడకండి. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు. రాకా చిత్రాన్ని పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నాడు. మరి పవన్ దారిలో బన్ని భుజానికి గాయం అని హెడ్డింగ్ ఏంటి అనుకోకండి.
బన్ని భుజానికి గాయం అయిన మాట నిజం. కాని ఇప్పుడు కాదు 2005లో ఒక సారి 2011లో మరోసారి, రెండు సార్లు బన్ని భుజానికి గాయం అయింది. 2005, 2011 గాయం అయిన రెండుసార్లు బన్ని ఎడమ భుజానికి సర్జరీలు జరిగాయి. 2011లో అయితే సర్జరీ తర్వాత కోలుకోవడానికి ఏకంగా 11 నెలలు పట్టిందట.
ఈ భుజం కథ ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చింది అంటే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్ కుడీ భుజానికి ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ డిశ్ఛార్జి అయ్యారు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.
ఇక బన్ని భుజానికి గాయం కథను ఎప్పుడు బయటపెట్టాడు అంటే, పుష్ప మొదటి భాగం విడుదల సమయంలో అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్లు ఓ భుజం పైకి ఉంటే బాగుండేది అనే ముందే సుకుమార్ , అల్లు అర్జున్ డిసైడ్ అయ్యారు. దీంతో సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన తొలివారం రోజులు అల్లు అర్జున్ ఎడమ భుజం పైకి పెట్టుకుని నటించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. గతంలో సర్జరీ జరిగిన చెయ్యి కావడంతో నొప్పని భరిస్తూనే అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొనాల్సి వచ్చింది. ఆ తర్వాత అదే నొప్పి అల్లు అర్జున్‌కు అలవాటు అయిపోయింది. కాకపోతే సినిమాలో బన్ని మ్యానరిజమ్ పాన్ వరల్డ్‌ను రీచ్ అయింది. పాన్ ఇండియా వైడ్‌గా అయితే సెన్సేషన్ సృష్టించింది.
2021లో విడుదలైన పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. కోవిడ్ టైమ్‌లోనూ ఈ చిత్రం సరాసరి 400 కోట్ల వ్యాపారం చేసింది.
ఇవి కూడా చదవండి
