
బాలీవుడ్ యాక్ట్రెస్ రాధిక ఆప్టే గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్, లయన్ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు వారి చేరువైంది. తమిళంలో రజనీకాంత్ సరసన కబాలి అనే సెన్సేషన్ మూవీలో కనిపించింది. భాషతో సంబంధం లేకుండా, పాన్ ఇండియా వైడ్ గా , తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్న అతికొద్ది మంది నటుల్లో రాధిక ఒకరు.
అయితే వివాహ బంధం ఎలా ఉండాలి అనేది, రాధిక ఒక స్పష్టతతో ఉండటం, చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.భార్య, భర్త ఎలా ఉండాలి అంటే, సమస్యలు వచ్చినప్పుడు వారిద్దరే పరిష్కరించుకోవాలి కాని, మూడో వ్యక్తికి, తమ జీవితంలో ఆహ్వానించడం అంత పెద్ద పొరపాట మరొకటి లేదు అంటోంది రాధిక. ఒకరిని ప్రేమించడం అంటే, అవతలి వ్యక్తి స్వేచ్ఛను కూడా గౌరవించాలి. భాగస్వామి విషయంలో అన్ని చెప్పి చేయాలి, చెప్పులేసుకెళ్లాలి, అన్ని తనకి చెప్పి చేయాలి అనే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే చాలా మందిచి అంటోంది.
అలాగే భర్త కోసం భార్య తన ఇష్టాలను త్యాగం చేయడం, లేదా తనకు నచ్చేలా ఉండేందుకు ప్రయత్నంలో తనని తాను కోల్పవడం లాంటివి చేయవద్దు అంటోంది. ప్రస్తుతం తాను, తన భర్త బెనెడిక్ట్ ఎవరి ప్రపంచం వాళ్లు ఉంటున్నారట. కాని అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారట.
ఇవన్ని జీవితంలో అనుభవం నేర్పే పాఠాలు. చాలా మంది తమ జీవితానికి సూత్రంగా మార్చుకుని, లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. రాధిక కూడా అంతే..2013లో బెనెడిక్ట్ ను ప్రేమించి పెళ్లాడింది. రెండేళ్ల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన జీవితం సాఫీగా సాగిపోతోంది.ఇక సినిమాల సంగతి అంటారా, కుటుంబం కోసం వాటిని పూర్తిగా తగ్గించేసింది.
ఇవి కూడా చదవండి
