
కొన్ని కథలు చాలా విభిన్నంగా, ఆశక్తికరంగా ఉంటాయి. అలాంటి కథే రిస్క్, ఏ గేమ్ ఆఫ్ యూత్. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన 6 టీన్స్ కు, ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి భాగం దారిలోనే ట్విస్టులు, వావ్ ఫ్యాక్టర్స్ చాలానే ఉన్నాయి. అందుకే సినిమా రిలీజైన రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇంతకీ రిస్క్, ఏ గేమ్ ఆఫ్ యూత్ కథేంటి.. ఎవరు ఎలా చేసారు.. దర్శకుడు ఎలా మాయ చేసాడు.. నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి… ప్రైడ్ తెలుగు రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి.
ముందు కథ సంగతి చూద్దాం.. ఫస్టాఫ్ జిల్, సెకండాఫ్ థ్రిల్
హీరో సందీప్ అశ్వ , అతని ముగ్గురు స్నేహితులు, పక్కా 420 పనులు చేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇలాంటి సమయంలో వీరికి ఓ ఐడియా వస్తుంది. మాజీ మిస్ ఇండియా పాత్ర చేసిన సందలి అరోరాకు దగ్గరవ్వాలి అనుకుంటారు. అనుకున్న విధంగానే మ్యూజిక్ వీడియో మేకర్లుగా మారుతారు. సందలికి దగ్గరయ్యేందుకు అద్భుతంగా నటిస్తారు. అయితే వారి ప్రయత్నంలో ముందుకెళ్తున్న సమయంలో, సందలి తన భర్తను హతమార్చమని కోరడంతో, షాక్ కు గురికావడం సందీప్ అండ్ బ్యాచ్ వంతు అవుతుంది. ఇంతకీ సందరి తన భర్తను ఎందుకు అంతం చేయాలనుకుంటుంది.. అందుకు హీరో ఇచ్చిన రియాక్షన్ ఏంటి.. ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది రిస్క్ చూస్తేనే తెలుస్తుంది.
స్క్రీన్ ప్లే మామూలుగా లేదుగా..
కథ సాగుతున్నా కొద్ది ట్విస్టులు రివీల్ అవుంటాయి, లోకేషన్స్, బ్యాక్ డ్రాప్స్ అదిరిపోతుంటాయి. ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర లాంటి కంపెనీలలో, బ్యాక్ గేట్ నుంచి ఉద్యోగాలకు వెళ్లిన వారిని, పంపే పాత్రలో హీరో నటన ఆకట్టుకుంటుంది. మొదటి భాగం సరదాగా సాగిపోతుంది. అసలు దర్శకుడు అనుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉండటమే, సినిమాను ఆశక్తికరంగా , కొత్తగా మలిచింది.
దర్శకత్వం, ఇతర విభాగాలు..
ఒకప్పుడు టాలీవుడ్ ను, తన బీట్స్ తో షేక్ చేసిన, మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడికృష్ణ. ఈ చిత్రం దర్శకుడిగా మారాడు. అంతే కాదు, తన కెరీర్ లో బిగ్గెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, 6 టీన్స్ మూవీకి సీక్వెల్ గా రిస్క్ ను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. రిస్క్ ను ఘంటాడి కృష్ణ తెరకెక్కించిన విధానం చూస్తే, ఇది అతని తొలి చిత్రం కాదనే విషయం ఇట్టే అర్దమవుతుంది. అంత ప్యాషనేట్‌గా మూవీని తీసాడు దర్శకుడు కృష్ణ. ఇక సంగీతం కూడా ఘంటాడినే బాధ్యతలు తీసుకున్నాడు. కథకు తగ్గట్లు, సందర్భానికి తగ్గట్లు పాటలకు సంగీతాన్ని అందించాడు. కాకపోతే దర్శకుడిగా ఎక్కువ మార్కులు వేయించుకున్నాడు. బాణీల విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే, మొదటి భాగం దారిలో పాటలు టాలీవుడ్ అంతా మార్మోగి ఉండేవి. ఆ ఒక్క లోటు కనిపించింది.
శివ శర్వాణి ఎడిటింగ్ లో అక్కడక్కడా తడబాట్లు ఉన్నాయి.. మరింత ఎంగేటింగ్ కట్ ఇక్కడ మిస్ అయింది. జగదీష్ కొమారి సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ టచ్..
రిస్క్ మూవీకి ఘంటాడి కృష్ణ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీత దర్శకత్వం, ఇందుకోసం అంతా కొత్త నటీ నటులను ఎంపిక చేసుకున్నాడు. అయినా సరే తనకు కావాల్సింది రాబట్టుకున్నాడు. ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనుభవం, ఎందరో దర్శకులతో పని చేసి విధానం, ప్రతి ఫ్రేమ్‌లోనూ సీనియర్ దర్శకుడు సినిమా తీసాడు అనేంతకగా రక్తి కట్టించాడు. మొత్తంగా యూత్ సబ్జెక్ట్ అయినా, యూత్ స్టోరీ అయినా, టోటల్ ఫ్యామిలీ సినిమాను చూసి ఎంజాయ్ చేసేలా తీసాడు ఘంటాడి కృష్ణ.
ప్రైడ్ తెలుగు రేటింగ్ – 3/5
ఇవి కూడా చదవండి
