కాంచన సిరీస్ కు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పటికే మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కోలీవుడ్స్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీగా కాంచన కొనసాగుతోంది. ప్రస్తుతం నాల్గవ భాగం సెట్స్ పై ఉంది. సిరీస్ లో ఇదే చివరి చిత్రం అంటూ లారెన్స్ చెబుతున్నాడు. అందుకే లాస్ట్ ఫిల్మ్ ఎలా ఉండబోతోంది అనేది కాంచన ఫ్యాన్స్ లో ఆశక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ చిత్రంలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార అడుగుపెట్టింది అనేది లేటెస్ట్ కోలీవుడ్ రూమర్.

కాంచన -4లో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, నోరా ఫతేహీ నటిస్తున్నారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో నయనతార కూడా కనిపించబోతోందని, ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే లారెన్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిరీస్ లో చివరి చిత్రం అంటూ ప్రచారం, మరో వైపు నయనతార ఎంట్రీ, దీంతో సజహంగానే సిరీస్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. కాంచన -4 విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.

నిజానికి ఈ పాత్రను తొలుత రష్మిక కోసం లారెన్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే రష్మిక ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో, ఈ పాత్ర చేసేందుకు, నయనతార ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంచన సిరీస్  , పైగా నయనతార ఎంట్రీ, తమిళనాట మాత్రం ఈ సినిమా సంచలన ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం

ఇక అభిమానులు అండ ఉంటే, రాజకీయాల్లోకి వస్తానని ఇటీవలే లారెన్స్ ప్రకటించాడు. అలాగే నయనతార కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. కాంచన -4 నయన్ ఖాతాలే లేటెస్ట్ ఎడిషన్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!