తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న సింగిల్ స్క్రీన్స్ లో పర్సంటేజీ వివాదం, పెద్దికి గట్టి షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ది నుంచే, పర్సంటేజీ కావాలని పట్టుబడుతున్నారు ఎగ్జిబీటర్లు. అలా కాకుండా, రెంటల్ తో పాటు కొంత పర్సంటేజీ ఇస్తామంటున్నారు నిర్మాతలు. ఇస్తే పర్సంటేజీ ఇవ్వండి, రెంటల్ విధానమే వద్దని ఎగ్జిబిటర్లు పట్టు వీడటం లేదు. దీంతో సింగిల్ స్క్రీన్స్ లోఅసలు పెద్దిని ప్రదర్శించకూడదని ఈ సినిమా నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకుంటే, దాదాపు 30 కోట్ల వరకు నష్టం వస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం మరింత ముదురుతుంది. తెలుగు సినీ పరిశ్రమను మరింత కష్టాల్లోకి నెడుతుంది.

పర్సంటేజీ విధానంపై మే 23న సింగిల్ స్క్రీన్ ఓనర్స్ మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పెద్ది విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది చర్చకు రానుంది. అంతకు ముందు ఫిల్మ్ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సమావేశం అయిన సంగతి తెలిసిందే. పర్సంటేజీ సమస్యపై ఒక కమిటీని ఏర్పాటు చేసి, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతా సర్దుకుంది. పెద్ది విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని స్వయంగా అగ్ర నిర్మాత దిల్ రాజు చెప్పిన తర్వాత కూడా ఎగ్జిబిటర్లు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం, పెద్ది నుంచే పర్సంటేజీ కావాలని పట్టుబట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!