
ఇప్పుడంటే రీమేక్స్ ను ఆడియెన్స్ చూడటం లేదు కాని, ఒకప్పుడు ఆ రీమేక్ మూవీస్ తోనే మెగాస్టార్, ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టాడు. అందుకే మెగాస్టార్ అంటే బాక్సాఫీస్ కు అంత భయం. అంతకు తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించిన రమణ అనే సినిమాను, చిరు తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ చేయించాడు. తమిళంలో విజయ్ కాంత్ హీరో, దర్శకుడు మురుగదాస్. కోలీవుడ్ లో రమణ సంచలన విజయం సాధించడంతో, తెలుగులో కూడా మురుగదాస్ తోనే రమణ రీమేక్ చేయించాలి అనుకున్నారు చిరు.
కాని కుదరలేదు. దాంతో వినాయక్ రంగంలోకి దిగి, చిరు ఇమేజ్ కు తగ్గట్లు కథను మార్చి, మాయ చేసి, ఆంధ్రదేశాన్ని ఊపేసేలా చేసాడు. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించడం అనే థియేటర్స్ దద్దరిల్లిపోయేవి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, ఠాగూర్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు మురుగదాస్. అయితే అది తెలుగులో కాదు తమిళంలో.. కాప్టెన్ విజయ్ కాంత్ తనయుడితో తీస్తాడట.
కాని మురుగదాస్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఒక స్పైడర్, ఒక దర్బార్, ఒక సికందర్ సినిమాలతో ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ దశలో తమిళంలో ఠాగూర్ కు సీక్వెల్ తీసినా, తెలుగు లో రీమేక్ కోసం చిరు తొందరపడకపోవచ్చు. ఒక ఐకానిక్ మూవీకి తొందర పడి సీక్వెల్ చేయకపోవచ్చు..
ఇవి కూడా చదవండి