సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఈ ఫోటోనే వైరల్ గా మారింది. యంగ్ చిరు ఫోటో చూసినవారు షాక్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరికొందరు మెగాస్టార్ లో ఈ వయలెంట్   లుక్ ఏ సినిమాలోనిది అని ఎంక్వైరీ చేస్తున్నారు. గూగుల్ చేస్తున్నారు. మెగాభిమానులను అడుగుతున్నారు. యూట్యూబ్‌ లో చిరు సినిమాలను తిరగేస్తున్నారు. మరికొందరు అయితే ఏఐ కూడా వాడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారి కోసమే ఈ పోస్ట్.

అసలు ఏం జరిగింది.. సందీప్ వంగా తన ఆఫీస్ లోని ఫోటో జస్ట్ షేర్ చేసాడు. ఫోటోలో ఆఫీస్ గోడపై, చిరు వింటేజ్ లుక్ తళుక్కున మెరిసింది. నిముషాల్లో ఆ మెగా వెయలెంట్ లుక్ వైరల్ అయింది. ఇంతకీ  ఈ లుక్ ఏ సినిమాలోని అనుకుంటున్నారా.. 1987లో వచ్చిన ఆరాధన మూవీలోనిది.. సినిమా ప్రారంభంలో కొద్ది నిముషాలు చిరంజీవి పులిరాజుగా విలనీ చూపిస్తాడు. ఆ తర్వాత మారిన మనిషిగా క్యారెక్ట ర్ లో వేరియేషన్ చూపిస్తాడు. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చినప్పుడు, లేదా ఇన్నేళ్లలో ,ఎప్పుడు ఎవరూ కూడా, చిరు లోని ఈ లుక్‌ను ప్రత్యేకంగా హైలైట్ చేయలేకపోయారు. కాని అర్జున్ రెడ్డి మేకర్, యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా, ఈ టెర్రిఫిక్ లుక్ ను వరల్డ్ కు రివీల్ చేసాడు.

నిజానికి చిరుకు తనకు తాను పెద్ద ఫ్యాన్ గా చెప్పుకుంటాడు సందీప్ వంగా. అందుకే మెగా ఫ్యాన్స్ కూడా సందీప్ వంగా తో చిరును ఒక చిత్రం చేయాల్సిందిగా, రిక్వెస్ట్ చేస్తుంటారు. కాని చిరు ఇప్పుడప్పుడే సందీప్ తో సినిమా చేసే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే సందీప్ వంగా ముందు స్పిరిట్ , ఆ తర్వాత యానిమల్ పార్క్, ఆ తర్వాత అల్లు అర్జున్ తో మూవీ ఉంది. వీటి తర్వాత యానిమల్ కింగ్ డమ్ తెరకెక్కుతుంది. ఆ తర్వాతే ఛాన్స్ ఉంటే చిరుతో సందీప్ వంగా మూవీ ఉంటుంది.అప్పటి వరకు మెగా ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.

error: Content is protected !!