
మెగా ఫ్యాన్స్ పండగ లాంటి వార్త ఇది. అదెలా అంటే, సంక్రాంతికి మాత్రమే, మీరు బయటికి వస్తే సరిపోదు. ఎందుకంటే, మార్చి మూడో వారం, నాలుగో వారం కూడా, మీరు బయటికి రావాల్సి ఉంటుంది. మెగా సెలబ్రేషన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎందుకంటే టాలీవుడ్ షేక్ అయ్యే రూమర్ ఇప్పుడు, ఇండస్ట్రీ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే మార్చి 27 పెద్ది రిలీజ్ అవుతోంది. ఈ సంగతి బాగా తెలుసు. కాని పెద్ది కంటే ముందు, అంటే మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుందని, మైత్రీ మూవీ మేకర్స్ లీక్స్ ఇస్తోంది. ఒక దశలో మార్చి 26న అంటే పెద్దికి ఒక రోజు ముందు విడుదల చేయాలనే ఆలోచన ఉన్నా, దానికంటే బెస్ట్ డేట్ మాత్రం మార్చి 19 అనే ప్లాన్ ఉందట మైత్రీ.
అయితే మార్చి 19న యశ్ నటిస్తోన్న టాక్సిక్ రిలీజ్ ఉంది. ఈ సినిమాతో క్లాష్ ఇష్యూ రావచ్చు అనే ఆలోచన కూడా చేస్తోంది మైత్రీ. అందుకే ఇంతవరకు రిలీజ్ డేట్ లాక్ చేయలేదు. త్వరలో ఉస్తాద్ నుంచి పవన్ స్టెప్పులేసిన హుషారైన గీతం విడుదల కాబోతోంది. ఈలోపు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి సాంగ్ ను రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో ఉంది మైత్రీ. మరి ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ కావడమే.. అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదేమో..

ఇవి కూడా చదవండి
