ధనుష్ ఏంటి, కమల్ హాసన్ ఏంటి, అంత పెద్దాయన్ని పట్టుకోని, వెబ్ సైట్ చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది రాస్తా అంటే ఎలా అని ఫైర్ అవ్వకండి. కమల్ కు ఈ స్టోరీ వారు ఎంత ఫ్యాన్స్ అయినప్పటికీ, అంతకంటే పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ప్రైడ్ తెలుగు వెబ్ సైట్ లో.. అందులో ఎలాంటి డౌట్స్ లేవు. ఆయన మహానటుడు. తిరుగులేని నటుడు. భారతదేశం గర్వించదగ్గ నటుడు. కాకపోతే కొన్నిసార్లు తప్పులను ఎత్తి చూపే ప్రయత్నంలో, ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ప్రయాణం చేస్తోన్న సమయంలో, ఒక వ్యక్తి విజయాన్ని, మరో వ్యక్తి పరజయాన్ని అందుకుంటున్నప్పుడు , ఆ విషయాన్ని మూడో వ్యక్తి ఎత్తి చూపించాల్సింది. ప్రస్తుతం ప్రైడ్ తెలుగు అలాంటి పనే చేస్తోంది.

కమల్ హాసన్, ధనుష్,ఇద్దరూ అల్టీమేట్ టాలెంటెడ్ యాక్టర్స్. పలు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తమిళ సినీ పరిశ్రమకు, ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో చాలా కృషి చేసారు. అంతే కాదు కమల్ మూవీకి కథ రాయగలరు. ధనుష్ కూడా స్టోరీ అద్భుతంగా రాస్తాడు. ఇక ఇద్దరి కీ డైరెక్షన్ అంటే ఎంత ప్యాషన్ ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కాని ధనుష్ మాత్రం తన సినిమాల వరకు, తాను డైరెక్ట్ చేసుకుంటున్నాడు. ఇందుకు రాయన్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరో వైపు ఇతర దర్శకులు అంటే వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల లాంటి దర్శకులు కథలు చెప్పినప్పుడు, వాటిల్లో నటించేందుకు డేట్స్ ఇస్తున్నాడు. అంతే కాని తాను కూడా డైరెక్టర్ అని ఎక్కడా ఇన్ వాల్వ్ కావడం లేదు.

కాని మరో వైపు కమల్ మాత్రం తరచూ  తన దర్శకుల పనుల్లో ఇన్ వాల్వ్ అవుతున్నారు. భారతీయుడు -2 మేకింగ్ లో కొంత భాగం కమల్ ఇంట్రెస్ట్ ఉంది అనేది సమాచారం. ఇక థగ్ లైఫ్ పేరుకే మణిరత్నం చిత్రం. కాని కమల్ హాసన్ ఈ చిత్రానికి కథను, స్క్రీన్ ప్లేను సైతం అందించారు. ఒక షిప్ కు ఒకే క్యాప్టెన్ ఉండాలి. ఇలా ఇద్దరు కలిస్తే ఏం జరుగుతుంది అనేది తెల్సిందే…  ఈ విషయంలో కమల్ హాసన్ కూడా రెండు వేరు వేరు దారుల్లో వెళ్లాలి. తన కథలకు తానే డైరెక్టర్ కావాలి. ఇతర దర్శకుల సినిమాలకు కేవలం నటించడం వరకు పరిమితం అయితే, విక్రమ్ లాంటి అద్భుతాలు జరుగుతాయి. విక్రమ్ సినిమాకు కూడా కమల్ లైన్ సూచించారు. లోకేష్ కనగరాజ్ చాలా తెలివిగా ఆ స్టోరీని డెవలప్ చేసి ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!