డబుల్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత, హీరో రామ్ నటిస్తోన్న సినిమా ఆంధ్ర కింగ్ తాలుకా.. ఇది పిఠాపురం MLA తాలుకా నుంచి పుట్టుకొచ్చిన టైటిల్, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అందుకే పవన్ ఏం చేసినా అది సంచనంగా మారుతుంది. ఈ సంగతి సరే..ఇక రామ్ తన బర్త్ డే గిఫ్ట్ గా, కొత్త సినిమా టైటల్ ను, టీజర్ ను రిలీజ్ చేసాడు. సినిమా పేరు ఆంధ్ర కింగ్ తాలుకా.. బాగానే ఉంది. కథ ప్రకారం చూస్తే ఇది అభిమాని బయోపిక్ అని చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది.. అది కూడా బాగానే ఉంది.

కాని అస్సలు బాగోలేనిది ఏంటంటే, ఆంధ్ర కింగ్ అని చెప్పి, కన్నడ కింగ్ ఉపేంద్ర కటౌట్ ను పెట్టడం, ఇక్కడే తేడా కొట్టేసింది. నిముషాల్లో సోషల్ మీడియాలో టైటల్ గురించే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆంధ్ర కింగ్ అంటే నాగార్జున అయినా సినిమాలో కనిపిస్తే ఒక లెక్కలో ఉండేది. అలా కాకుండా కన్నడ సూపర్ స్టార్ ను పోస్టర్ లో చూపిస్తూ, ఆంధ్ర కింగ్ అంటే , ఆ టైటిల్ ను ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు.

తెలుగులో ఒక టాప్ హీరో, అతని అభిమాని నేపథ్యంలో సినిమా అన్నప్పుడు, తెలుగు హీరోను చూపిస్తే అయిపోయేదానికి, కన్నడ హీరోను చూపిస్తున్నారు. ఇందులో రామ్ తప్పిదం కూడా ఉంది. తెలుగు టాప్ హీరోలకు అభిమానిగా నటించేందుకు రామ్ ఒప్పుకోలేదా.. ఈ పొరపాటు ఎక్కడ జరిగింది అనేద మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

ఆంధ్ర కింగ్ తాలుకా అనేది చాలా పవర్ ఫుల్ టైటిల్, మాస్ కు కనెక్ట్ అయ్యే టైటిల్, కాని స్టార్ కాస్ట్ విషయంలో ఇంకొంచెం దృష్టి పెట్టాల్సింది. ఇందులో ఉపేంద్రను తక్కువే చేసి చూడటంలేదు. అతనో లెజెండ్. పాన్ ఇండియాలోనే పాపులర్ అయిన బిగ్గెస్ట్ సినిమాటిక్ పర్సెన్. కాకపోతే ఆంధ్ర కింగ్ కాదు కదా అనేది ఇక్కడ పాయింట్. గతంలో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా తీసిన డైరెక్టర్ మహేష్ బాబు, ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలుకా ను తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. రిలీజ్ డేట్ ఇంకా ఎనౌన్స్ చేయలేదు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!