
సందీప్ వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ నుంచి దీపిక ఎందుకు తప్పుకుంది అనేది, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ విధంగా చూసినా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో స్పిరిట్ ఒకటి. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగా తెరకెక్కించబోతున్న సినిమాలో అవకాశం అంటే, మరోవెయ్యి కోట్ల సినిమా ఖాతాలో పడినట్లే.. అంతేనా కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ ఖాయం అవుతుంది.
అయితే ఇంద పెద్ద చిత్రాన్ని దీపిక ఎందుకు వద్దనుకుంది అంటే అందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా షారుఖ్ నటించే కొత్త చిత్రం కింగ్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. డంకీ తర్వాత షారుఖ్ నటిస్తోన్న మూవీ కావడం అంతే కాకుండా పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మూవీ కావడంతో, దీపిక స్పిరిట్ కంటే,
కింగ్ అనే చిత్రానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అటు షారుఖ్, ఇటు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇద్దరూ కూడా దీపికకు చాలా క్లోజ్. షారుఖ్ తో దీపిక ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్ ప్రెస్, పఠాన్, జవాన్, లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించింది. ఇక సిద్ధార్ధ్ ఆనంద్,
ఈ మధ్య తెరకెక్కించే ప్రతి చిత్రంలోనూ తనే హీరోయిన్. అందుకే దీపిక స్పిరిట్ కు దూరం జరిగి, కింగ్ కు డేట్స్ కేటాయించింది అనేది బీటౌన్ వర్గాలు చెబుతున్న మాట. అయితే ప్రభాస్, దీపిక కాంబినేషన్ చూడాలి అనుకుంటే మాత్రం మళ్లీ కల్కి -2 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి