
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వస్తోన్న చిత్రం వార్-2. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా చిత్ర యూనిట్ గ్రాండ్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఒకటిన్నర నిముషం నిడివి ఉన్న ఈ టీజర్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ , గ్రీక్ గాడ్ ఎక్స్ వేదికగా రిలీజ్ చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ ను వార్ ఫ్రాంఛైజీలోకి ఆహ్వానించాడు.
వార్ మొదటి భాగంలో హృతిక్ కబీర్ పాత్రతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. రా ఎజెంట్ పవర్ ఏంటో చూపించాడు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కు అదే విధంగా పవర్ చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ సిద్దంగా ఉండండి.. దయకు చోటు లేదు.. నరకానికి స్వాగతం అంటూ ప్రేమతో పిలిచాడు. #War2teaser #War2

యశ్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన చిత్రాలో , హృతిక్ మూడు చిత్రాల్లో నటించినట్లు అయింది. 2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ వార్ తో యశ్ రాజ్ స్పై యూనివర్స్ లోకి అడుగుపెట్టాడు హృతిక్. ఈ సినిమా ఆ ఏడాది అత్యఅధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3లో కొద్ది నిముషాలు మెరిసాడు హృతిక్. ఇప్పుడు వార్ -2తో మరోసారి పూర్తిస్థాయి స్పై క్యారెక్టర్ చేస్తున్నాడు. మొదటి భాగంలో టైగర్ ష్రాఫ్ విలన్ గా నటిస్తే, ఇప్పుడు రెండో భాగంలో టాలీవుడ్ స్టార్, యంగ్ టైగర్, త్రిబుల్ ఆర్ హీరో ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్నాడు.
వార్ వన్ లో ఏవిధంగా అయితే హృతిక్ క్యారెక్టర్స్ ను, లుక్స్ ను, సిద్ధార్థ్ ఆనంద్ హైలైట్ చేసాడో, సేమ్ టు సేమ్ ఇప్పుడు అయన్ ముఖర్జీ కూడా గ్రీక్ గాడ్ ఇమేజ్ కు తగ్గట్లు పాత్రను తీర్చిదిద్దాడు. ఆ విషయం టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. మైండ్ బ్లాక్ చేసే ఎంట్రీ, అదిరిపోయే యాక్షన్ సీన్స్, టెర్రిఫిక్ లుక్స్ తో, మరోసారి మెస్మరైజ్ చేసాడు హృతిక్ రోషన్.

అసలు కబీర్ ఇంత వయలెంట్ గా మారుతాడని, టైగర్ 3 క్లైమాక్స్ లోనే యశ్ రాజ్ ఫిల్మ్స్ రివీల్ చేసింది. అప్పటి నుంచి ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీక్వెల్ కోసం కోట్లాది కళ్లు ఎదురు చూస్తూ వచ్చాయి. అందుకు తగ్గట్లే ఇటీవల విడుదలైన టీజర్ లో కబీర్ క్యారెక్టర్ అంచనాలను అందుకుంది. మొదటి భాగం కంటే డబుల్, త్రిబుల్ యాక్షన్ ను, హృతిక్ నుంచి వయలెన్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వార్ -2 టీజర్ చూసిన తర్వాత వారు ఎక్స్ పెక్టేషన్స్ ను మించిపోయింది అనే టాక్ తెచ్చుకుంది.
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినీ ప్రయాణం మొదలై 25 ఏళ్లు పూర్తి కానుంది. ఇంత సుదీర్ఘ సినీ ప్రస్థానంలో హృతిక్ హిందీ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. తనని తాను సూపర్ స్టార్ గా మలుచుకున్నాడు. ధూమ్ 2, అగ్నిపథ్, వార్, విక్రమ్ వేదా, ఫైటర్ లాంటి చిత్రాలతో, ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లోనూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించాడు హృతిక్ రోషన్.

ఇక ఆదిత్య చోప్రా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై, ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.గతంలో బ్రహ్మాస్త్ర మూవీని తెరకెక్కించి అబ్బురపరిచిన అయాన్ ముఖర్జీ, ఈసారి పూర్థి స్థాయి యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వార్ -2 లో హృతిక్ తో పాటు ఎన్టీఆర్, అలాగే కియారా అడ్వానీ నటించింది. ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి