ఒక వారంలో క్రితం టాక్సిక్ క్రేజ్ వేరు. ఇప్పుడు వేరు. రిలీజ్‌కు ముందు ఈ చిత్రం, వెయ్యి కోట్లు కొల్లగొడుతుంది అనే అంచనాలు కనిపించాయి. కాని ఇప్పుడు ఈ చిత్రం, అతి కష్టం మీద 300 కోట్ల వసూళ్లను దాటింది.

ఇందులో మొదటి రోజులో వచ్చిన వసూళ్లే ఎక్కువ. కేజీయఫ్ 2 తర్వాత యశ్ నటించిన చిత్రం కావడంతో, భారీ అంచనాల నేపథ్యంలో యశ్ ఫ్యాన్స్ ఈ సినిమాను తొలి రోజు చూసేందుకు పోటీ పడ్డారు. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ వంద కోట్లు దాటాయి. లేకపోతే కలెక్షన్స్ ఇంకా దారుణంగా ఉండేవి. ఇదంతా పక్కన పెడితే, తొలి వారంలో టాక్సిక్ సరాసరి 300 కోట్ల వసూళ్లను దాటింది. టాక్ బాగుండి, సినిమా కూడా బాగుంటే, ఈ పాటికి వెయ్యి కోట్ల పరుగులో ఉండేవాడు రాకీభాయ్. కాని డివైడ్ టాక్ ఈ సినిమాకు శాపంగా మారి డిజాస్టర్ వైపు నడిపిస్తోంది.

అయినప్పటికీ 300 కోట్లు చిన్న విషయం కాదు. ఇందులో కన్నడ సినీ పరిశ్రమ కంటే కూడా బాలీవుడ్ వాటానే ఎక్కువ. నార్త్ ఇండియా నుంచి 150 కోట్లు వచ్చాయి. మిగితా 150 కోట్లలో లెక్క చూస్తే, కన్నడ సినీ పరిశ్రమ 70కోట్లు, టాలీవుడ్‌ నుంచి 30 కోట్లు వచ్చాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో యశ్ సినిమాకు పెద్దగా వసూళ్లు రాలేదు రెండు రాష్ట్రాల వసూళ్లను కలుపుకుంటే 15 నుంచి 17 కోట్ల వరకు ఉంటుంది.ఇక ఓవర్సీస్ మార్కెట్‌ నుంచి మరో 40 కోట్లు. ఇదీ తొలివారంలో టాక్సిక్ సాధించిన వసూళ్లు. మొదటి వారంలో కేజీయఫ్ సీక్వెల్ 700 కోట్లకు పైగా కలెక్షన్స్ చూసింది. ఆ తర్వాత అదే స్పీడ్‌లో 1200 కోట్ల వసూళ్ల వరకు వెళ్లింది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!