ప్రైడ్ తెలుగులో స్టోరీలు రాసే వారికి ఏదో అయింది.లేకపోతే ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఓ సినిమాను పట్టుకుని, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని హెడ్డింగ్ పెట్టడం ఏంటి అనుకోకండి, ఇందులో చాలా లెక్కలు ఉన్నాయి. సోషల్ మీడియా యుగంలో, సోషల్ మీడియా పల్స్ తెల్సిన దర్శకుడు ఉంటే చాలు, బ్లాక్ బస్టర్ అవలీలగా నడుచుకుంటూ వస్తుంది.

 ఇరుముడి చూశారుగా, అయ్యప్పస్వామి భక్తుడి కథ, మల్లెపూల పల్లకి కావాలంటూ డిస్సషన్, అందుకు తగ్గట్లే దర్శకుడు సినిమా కథను మలచడం, మల్లెపూల పల్లకి పాటను చక్కగా తెరకెక్కించడం, సినిమా రిలీజైన తర్వాత బ్లాక్ బస్టర్ కావడం అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిపోయింది. ఇఫ్పుడు ఓజీ సీక్వెల్ కు అంతే, ఈ సినిమా సీక్వెల్ ఎనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి సోషల్ మీడియాలో మామూలు ఎడిట్స్ కనిపిస్తున్నాయా, షేక్ ఆడిస్తున్నాడు పవన్ ఫ్యాన్స్. ఇక ఇన్ స్టాలో అయితే ఆల్రెడీ పవన్, తన పెట్ డ్రాగన్ తో లెక్కలేనన్ని వీడియోస్ వచ్చేసాయి. ఇఫ్పుడు సుజిత్ చేయాల్సిందల్లా, మంచిగా సీక్వెల్ కథ, పవన్ చేతిలో కత్తి, వెంటే ఒక డ్రాగన్ నేపథ్యంలో కొన్ని సీన్స్ రాస్తే చాలు, ఈ చిత్రం పాన్ ఇండియాను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

మొదటి భాగం, కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే భారీ వసూళ్లను కొల్లగొట్టింది. సరాసరి 300 కోట్లను రాబట్టింది. సీక్వెల్ కనుకగా అంచనాలకు దగ్గరి ఉంటే, ఈ వసూళ్లు మొదటి వీకెండ్‌లోనే అధిగమించే అవకాశాలు ఉన్నాయి. పైగా పపన్ బర్త్ డేకు ఎనౌన్స్ చేసిన టీజర్ నెక్ట్స్ లెవల్లో ఉండటం మరింతగా హైప్ పెంచింది. ప్రస్తుతం చేతికి సర్జరీ కారణంగా పవన్ కేరళలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. తిరిగొచ్చిన తర్వాత సీక్వెల్‌ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!