వారణాసి తర్వాత, మహేష్ బాబు చేయబోయే చిత్రం ఏంటి అనేది, ఈ మధ్యే కొంత వరకు క్లారిటీ వచ్చింది. సందీప్ వంగా దర్శకత్వంలో, మహేష్ బాబు మూవీ ఉంటుందని, రొమాంచకం ప్రమోషన్స్ లో ప్రణయ్ రెడ్డి వంగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే సందీప్ వంగా ప్రస్తుతం స్పిరిట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత యానిమల్ సీక్వెల్ పేరు చెబుతున్నాడు. ఆ తర్వాతే మహేష్ మూవీ అంటున్నాడు.

ఇందుకు చాలా సమయం పడుతుంది. అందుకే మహేష్ బాబు సందీప్ వంగా కంటే ముందు ఒక చిత్రం చేయాలి అనుకుంటున్నాడా.. అందుకు వేగంగా సినిమాలు తీసే , మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిత్రం చేయాలి అనుకుంటున్నాడా..

ఇందుకు సంబంధించి చాలా రూమర్స్ వచ్చినప్పటికీ ప్రతిసారి అనిల్ రావిపూడి బ్రేక్ వేస్తూ వచ్చాడు. కాని ఇప్పుడు మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ను కోలీవుడ్ మీడియా ఖరారు చేస్తోంది.పైగా హీరోయిన్ గా మమిత బైజు పేరు చెబుతోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది మమిత,ఇఫ్పుడు  ఈ హీరోయిన్ , మహేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తోంది.

ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ , కల్యాణ్ రామ్ హీరోలుగా,జనవరి 12 విడుదల అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొత్త సినిమా ఏంటి ఇంకా రావిపూడి ఖరారు అయితే చేయలేదు.  మరో వైపు మహేష్ నటిస్తోన్న వారణాసి ఏప్రిల్ 7న రిలీజ్ కు రెడీ అవుతోంది. అక్టోబర్ తో చిత్రీకరణ పూర్తి అవుతుందని రాజమౌళి గతంలోనే చెప్పాడు. ఇక మిమిత తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు ఇటీవలే తెలిపింది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!