అన్ని సార్లు హిట్టు సినిమాలు తీయాలని కాదు. కాని తీసిన సినిమాలు కూడా కొన్ని సార్లు దర్శకుడి స్థాయిని నిర్ణయిస్తాయి. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఫ్లాప్ ఇచ్చినా, ఆ మూవీకి ఒక రేంజ్‌ ఉంటుంది. ఖలేజా అందుకు ఒక ఉదాహరణ. కాని ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమాలు, ఆయన స్థాయికి తగ్గట్లు తెరకెక్కడం లేదు. అల వైకుంఠపురంలో ఒక్కటే కాస్త మెప్పించింది. అది కూడా ఇంటిగుట్టు చిత్రం ఆధారంగా తెరకెక్కింది. ఇక గుంటూరు కారం పర్లేదు అనిపించుకుంది. ఆదర్శ కుటుంబం అయితే దారుణంగా విఫలం అయింది. బ్రాండ్ త్రివిక్రమ్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. అందుకే ఇప్పుడు మాటల మాంత్రికుడు ఆలోచనలో పడ్డాడు.

ముందుగా తన గత కొన్నాళ్లుగా ఒకే బ్యానర్‌కు వర్క్ చేస్తూ వస్తోన్న హారికా హాసినీ క్రియేషన్స్‌ నుంచి బయటికి వచ్చేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడని, టాలీవుడ్‌లో బాగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే, జులయితో మొదలైన బంధం, ఆదర్శ కుటుంబంతో ముగినట్లే..

అయినా ఇది కూడా మంచిదే.. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ హౌజ్ కు అనుబంధంగా, నాగ వంశీ ఆధ్వర్యంలో నడుస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంతో, ఆ ప్రభావం హారికా హాసినీలో తెరకెక్కే త్రివిక్రమ్ సినిమాలపై పడుతోంది. ఇటీవల ఆదర్శ కుటుంబం రిలీడ్ డేట్ ను త్యాగం చేసి మరీ జైలర్ సీక్వెల్‌ను రిలీజ్ చేసారు. ఇది, హారికా హాసినీ క్రియేషన్స్ కు, త్రివిక్రమ్ కు గ్యాప్ పెంచిందని సమాచారం. అంతే కాదు, ఇదే బ్యానర్‌ నుంచి రావాల్సిన గాడ్ ఆఫ్ వార్ కూడా ఆగిపోయిందని టాక్.

త్రివిక్రమ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్  పై మరిన్ని అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రైడ్ తెలుగు మీకు అందిస్తుంటుంది… ఫాలో అవ్వడం, షేర్ చేయండి, ప్రోత్సహించండి..

ఇవి కూడా చదవండి..

error: Content is protected !!